Lifestyle: రక్తం పెరగడానికి ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.? వెంటనే ఈ పనిచేయండి..

|

Jul 29, 2024 | 5:43 PM

ఇటీవల రక్త హీనత సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా రక్త హీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. అయితే రక్త హీనత మరెన్నో ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని మీకు తెలుసా.? శరీరంలో సరిపడ రక్తం లేకపోతే తీవ్ర సమస్యలు

Lifestyle: రక్తం పెరగడానికి ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.? వెంటనే ఈ పనిచేయండి..
Hamoglobin
Follow us on

ఇటీవల రక్త హీనత సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా రక్త హీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. అయితే రక్త హీనత మరెన్నో ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని మీకు తెలుసా.? శరీరంలో సరిపడ రక్తం లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తుంటారు.

అయితే రక్త హీనత ఉన్న వాళ్లు వైద్యుల సూచించే మందులను వాడడం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహార నియమావళిని మార్చడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సహజంగా రక్తాన్ని పెంపొందించుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ సహజంగా రక్తాన్ని ఎలా పెంపొదించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తహీనత సమస్య ఉన్న వారు ఐరన్‌ అధికంగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో బచ్చలికూర, కాయధాన్యాలు, బీన్స్, టోఫు, లీన్ మాంసం, పౌల్ట్రీ, చేపలు, తృణధాన్యాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను కచ్చితంగా తీసుకోవాలి. వీటితో పాటు.. క్యాప్సికం, టొమాటో వంటి వాటిని క్రమంతప్పకుండా తీసుకోవాలి. ఇక గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకంటే విటమిన్‌ బీ12 పుష్కలంగా లభిస్తుంది.

రక్త హీనతనతో బాధపడే వారు దానిమ్మ రసాన్ని తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో రక్త కొరతను భర్తీ చేస్తాయి. క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగడం వల్ల ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించడంలో ఉపయోగపడతాయి. ఇక శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి ఇందుకోసం సరిపడా నీరు తాగాలి.