Acidity: అసిడిటీతో బాధపడుతున్నారా.? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం..
మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిసిందే. అయితే మోతాదుకు మించి యాసిడ్ ఉత్పత్తి అయితే అసిడిటీ సమస్య వస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పాటు, కడుపులో మంట, నొప్పి, వాంతులు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి వారిలో నిత్యం పుల్లటి తేన్పులతో పాటు కడుపులో మంటగా ఉంటుంది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించి...

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా అసిడిటీతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిసిందే. అయితే మోతాదుకు మించి యాసిడ్ ఉత్పత్తి అయితే అసిడిటీ సమస్య వస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో పాటు, కడుపులో మంట, నొప్పి, వాంతులు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి వారిలో నిత్యం పుల్లటి తేన్పులతో పాటు కడుపులో మంటగా ఉంటుంది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించి మందులను వాడుతుంటారు. అయితే అసిడిటీని కొన్ని న్యాచురల్ పద్ధతుల్లో కూడా తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఇన్‌స్టాంట్‌గా అసిడిటీ లక్షణాలను తగ్గించుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..
* అసిడిటీ కారణంగా కడుపు మంటగా ఉంటే పాలను తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లటి పాలను తాగితే మరింత మెరుగైన ప్రయోజనం పొందొచ్చు. దీంతో అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. పాలలోని కాల్షియం కడుపులో ఆమ్లం ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో కడుపులో మంట, నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కడుపులో మంటగా ఉంటే వెంటనే చల్లటి పాలను తాగాలి.
* అసిడిటీకి చెక్ పెట్టడంలో సెలెరీ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ వెజిటేబుల్‌తో అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇందులోని క్రియాశీల ఎంజైమ్‌లు, రసాయనాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఇది కడుపులో యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆకుకూరల వినియోగం యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
* యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే మాలిక్ యాసిడ్ అసిడిటీని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కడుపులో యాసిడ్ స్రావాన్ని తగ్గిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తాగడం వల్ల ఎసిడిటీ వల్ల కలిగే మంట, నొప్పి తగ్గుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని రోజూ తాగితే అసిడిటీ అదుపులో ఉంటుంది.
* తులసి ఆకులు కూడా అసిడిటీకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అసిడిటీని తరిమికొడతాయి. ఇది కడుపులో యాసిడ్ ప్రభావాన్ని తగ్గించి కడుపుని ప్రశాంతంగా ఉంచుతుంది. కొన్ని తులసి ఆకులను గ్రైండ్ చేసి నీటిలో కలుపుకుని తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. దీని రెగ్యులర్ ఉపయోగం అసిడిటీని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..