
చలికాలం వచ్చిందటే చాలు వ్యాధులు వెంటాడుతాయి. ఇన్ఫెక్షన్స్ కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. జలుబుతో పాటు, ఛాతీలో కఫం పేరుకుపోతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే సకాలంలో చికిత్స అందించకపోతే వ్యాధి తీవవ్రంగా మారే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలం చిన్నారుల్లో కఫం పెరిగిపోతుంది. దీంతో చిన్నారుల్లో దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. అలాగే నోటి నుంచి కఫం లేదా శ్లేష్మం బయటకు వస్తుంది. గొంతులో నొప్పి లేదా మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఛాతీలోనూ మంటగా ఉంటుంది. కఫం పసుపు లేదా ఎరుపు రంగులోకి మారితే అది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కఫం రంగు మారితో వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. అయితే కఫం రంగు ఒకవేళ తెలుపు రంగులో ఉంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపునులు చెబుతున్నారు.
చిన్నారుల్లో కఫం సమస్య తగ్గించేందుకు వైద్యులు నెప్లైజర్‌ని ఉపయోగించడం లేదా సిరప్‌లు వంటివి సూచిస్తుంటారు. అయితే వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో కఫం సమస్యకు సహజంగా చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా.? చిన్నారుల్లో కఫం సమస్యను తగ్గించడంలో ఆవ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆవనూనెతో చిన్నారుల ఛాతీపై మసాజ్ చేయడం వల్ల కఫం కరిగిపోతుంది. ఆవనూనెలో వెల్లుల్లిని కలిపి మసాజ్ చేస్తే మెరుగైన ఫలితం పొందొచ్చు.
ఇందుకోసం ముందుగా ఆవ నూనె తీసుకొని అందులో చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి, నూనెను వేడి చేయాలి. ఆ తర్వాత నూనెను ఛాతీపై రుద్దాలి ఇలా చేస్తే కఫం కరిగిపోతుంది. ఇక కఫాన్ని సహజంగా తొలగించడానికి మరో చిట్కా కూడా అందుబాటులో ఉంది. పాలను వేరువెచ్చగా వేడి చేసి అందులో పసుపు కలుపుకొని తాగించాలి. పసుపు శరీరంలో హీట్‌ను పెంచుతుంది. ఈ కారణంగా శరీరం నుంచి కఫం సులభంగా కరిగిపోతుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..