Teeth Care: పళ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే వీటిని తీసుకుంటే చాలా మంచిది!

|

Sep 14, 2023 | 4:50 PM

మన శరీరంలో ముఖ్యమైనవి గుండె, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు మాత్రమే కాదు.. దంతాలు కూడా ముఖ్యమైనవే. దంతాలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఆహారాన్ని తీసుకోగలం. లేదంటే చాలా కష్టం. ఏం తినాలన్నా.. తాగాలన్నా దంతాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం తీసుకునే ఆహారం.. దంతాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. పళ్ల మధ్య ఇరుక్కుని బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. వీటి కారణంగా నోటి దుర్వాసన, పళ్ల సమస్యలు చిగుళ్ల సమస్యలు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. గార పట్టి, పళ్ల సమస్యలు వస్తే తప్ప. అప్పుడు వీటి కోసం..

Teeth Care: పళ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే వీటిని తీసుకుంటే చాలా మంచిది!
Teeth
Follow us on

మన శరీరంలో ముఖ్యమైనవి గుండె, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు మాత్రమే కాదు.. దంతాలు కూడా ముఖ్యమైనవే. దంతాలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఆహారాన్ని తీసుకోగలం. లేదంటే చాలా కష్టం. ఏం తినాలన్నా.. తాగాలన్నా దంతాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం తీసుకునే ఆహారం.. దంతాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. పళ్ల మధ్య ఇరుక్కుని బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. వీటి కారణంగా నోటి దుర్వాసన, పళ్ల సమస్యలు చిగుళ్ల సమస్యలు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. గార పట్టి, పళ్ల సమస్యలు వస్తే తప్ప. అప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా కేర్ తీసుకుంటారు. అదేదో ముందే తీసుకుంటే ఆ సమస్యలు వచ్చేవి కాదు. కాబట్టి ఇప్పటికైనా దంతాల కోసం జాగ్రత్తలు పాటించండి. కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే ఇతర సమస్యలే కాకుండా దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

కాల్షియం:

దంతాలు హెల్దీగా ఉండాలంటే కాల్షియం కావాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది. పాలు, పాల ఉత్పత్తులు, పన్నీర్, పాల కూర వంటి వాటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఆరోగ్యంతో పాటు దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే పళ్లపై ఉండే బ్యాక్టీరియా శాతం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఫైబర్:

ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను కూడా తీసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫైబర్ పళ్లపై ఉన్న క్రిములను, పాచిని తొలగిస్తుంది. దీంతో దంతాల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

చూయింగ్ గమ్:

అలాగే స్వీట్ తక్కువగా ఉన్న చూయింగ్ గమ్ లు కూడా పళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వీటిని బాగా నమిలి ఉండటం వల్ల దంతాలపై ఉన్న పాచి పోయి దంతాలు మెరవడమే కాకుండా శుభ్ర పడతాయి.

కొబ్బరి నూనె:

దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి నూనె కూడా సహాయ పడుతుంది. వీటిని కూరల్లో కలిపి వండి తీసుకోవడం వల్ల పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి.

అలాగే పళ్లను రెండు పూటలా బ్రేష్ చేసుకోవాలి. రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో, పళ్ల మధ్య ఆహారం ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తూ ఉంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి