Mustard Benefits: తేలు విషాన్ని హరించాలంటే ఆవాలతో చెక్ పెట్టండిలా!!

|

Aug 01, 2023 | 2:46 PM

మన వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో లభించే తాలింపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటని అందరికీ తెలిసిన విషయమే. ఆవాలను పోపుకు తప్ప ఇంకా ఏయే అనారోగ్యాలను దూరం చేసేందుకు.. ఎలా ఉపయోగిస్తారో మీకు తెలుసా ? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఆవాలు, ఆవపిండి, ఆవనూనె.. ఇలా రకరకాలుగా ఆవాలను వాడి కొన్నిరకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవాలు.. నిజానికి ఇవి వాత (వేడిచేసే) గుణాన్ని కలిగి ఉంటాయి. తేలు కుట్టినపుడు..

Mustard Benefits: తేలు విషాన్ని హరించాలంటే ఆవాలతో చెక్ పెట్టండిలా!!
Mustard Benefits
Follow us on

మన వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో లభించే తాలింపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటని అందరికీ తెలిసిన విషయమే. ఆవాలను పోపుకు తప్ప ఇంకా ఏయే అనారోగ్యాలను దూరం చేసేందుకు.. ఎలా ఉపయోగిస్తారో మీకు తెలుసా ? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఆవాలు, ఆవపిండి, ఆవనూనె.. ఇలా రకరకాలుగా ఆవాలను వాడి కొన్నిరకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

-ఆవాలు.. నిజానికి ఇవి వాత (వేడిచేసే) గుణాన్ని కలిగి ఉంటాయి. తేలు కుట్టినపుడు.. ఆ విషాన్ని హరించే గుణం ఆవాలకు ఉంది. ఆవాలు, పత్తి ఆకులను కలిపి మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట రాస్తే.. విషం హరించుకుపోతుంది.

-50 గ్రాముల ఆవనూనెను గోరువెచ్చగా ఉండేలా వేడి చేసి.. అందులో 20 అమృతధార చుక్కల్ని కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని చర్మంపై రాస్తే దురదలు, దద్దుర్లు వెంటనే తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

-ఆవాలను దోరగా వేయించి.. మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రెండు చిటికెల మోతాదులో రోజూ రాత్రివేళ భోజనంలో మొదటి ముద్దలో తింటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. అలాగే పెద్దలకు బట్టల్లోనే మూత్రవిసర్జన అవ్వకుండా కూడా ఉంటుంది.

-100 గ్రాముల ఆవాలను వేయించి.. వాటికి సమాన మోతాదులో బెల్లాన్ని కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని బఠాణీ గింజంత మాత్రలుగా చుట్టి ఒక గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. రోజుకి రెండుపూటలా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

-మూర్చతో స్పృహ కోల్పోయిన వారికి.. మంచినీటితో కలిపి ఆవాలను నూరి.. వాటి వాసన తగిలేట్టుగా ముక్కు దగ్గర ఉంచితే వెంటనే స్పృహ లోకి వస్తారు.

-బోదకాలు (Filariasis). క్యూలెక్స్ అనే ఒకరకమైన దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆవాలు, ఉమ్మెత్త ఆకులు, ఆముదపు చెట్టు వేర్లు, మునగచెట్టు బెరడుని సమానంగా తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని బోదకాలు వాపులపై రాసి కట్టుకడితే క్రమంగా వాపులు తగ్గుతాయి.

-పిల్లలు పుట్టాక చాలామంది స్త్రీలు జారిన చనులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. దానిమ్మ చెట్టు బెరడును తగినంత ఆవనూనెతో కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమం నుంచి తీసిన రసాన్ని నిల్వ చేసుకోవాలి. రాత్రివేళ పడుకునే ముందు చనులు (Breast)పై ఆ రసాన్ని రాసుకుని మర్దనా చేసి, దూదిని ఉంచి బిగుతైన లో దుస్తులు ధరించాలి. ఇలా చేస్తే కొద్దిరోజుల్లోనే చనులు బిగుతుగా తయారవుతాయి.

-దోరగా వేయించిన ఆవాలను పొడిచేసి నిల్వ చేసుకోవాలి. రోజూ అరగ్రాము మోతాదు పొడిని అరకప్పు పెరుగులో కలిపి ఉదయాన్నే పిల్లలకు తినిపిస్తే.. కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి