Moringa Leaves Juice: మునగ కాయలు కాదు.. ఆకులు కూడా ఆరోగ్యానికి మంచిది. మనగాకును కూరగా చేసుకుని తింటాం.. మునగాకులో ఎన్నో పోషకాలుతో పాటు విటమిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విటమిన్ బి2, ఐరన్, మెగ్నిషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. మనగాకే కాదు.. మునగాకు రసంతో కూడా అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం..
*మునగాకును రోజూ ఏదొక రూపంలో తీసుకుంటే శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఎముకలకు బలం చేకూరి దృఢంగా మారుతాయి.
*మైగ్రేన్ తో ఇబ్బందిపడేవారు మునగ చెట్టు వేళ్లను బాగా కడిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే తగ్గుతుంది.
*కొన్ని మునగ ఆకులను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను కలిపి కంటి రెప్పలపై పెట్టుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా తగ్గుతుంది.
*మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్‌లు దూరమవుతాయి. కణజాలాల పెరుగుదలను అడ్డుకుంటాయి. విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండడం వల్ల క్యాన్సర్ కారక పదార్థాలు నాశనమవుతాయి.
*సాగర్ లెవెల్ కంట్రోల్ కావాలనుకునేవారు మునగాకును ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉదయాన్నే పరగడుపునతీసుకోవాలి. ఇది మధుమేహం వ్యాధిగ్రస్తుల రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.
*మునగాకులో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులకు చెందిన రసాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్నట్టయితే రక్తం శుద్ధి అవుతుంది. చర్మ సంబంధ సమస్యలు కూడా నయమవుతాయి.
*మునగాకు రసాన్ని తాగితే వృద్ధాప్యం కారణంగా శరీరంపై వచ్చే ముడతలు పోతాయి.
Also Read: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్