Monsoon Hair Care: వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే..

జుట్టు రాలడమనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. ఇటీవల ఇది చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

Monsoon Hair Care: వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే..
Monsoon Hair Care

Updated on: Jul 24, 2021 | 9:27 AM

జుట్టు రాలడమనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. ఇటీవల ఇది చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడం సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ సీజన్‏లో ఎక్కువగా జుటు రాలిపోతుంటుంది. దీంతో ఎన్నో రకాల సప్లిమెంట్స్, కెమికల్ షాంపులు, రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. కానీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో జుట్టు సమస్యలపై డాక్టర్లను సంప్రదించాలి. అంతేకాకుండా.. కొన్ని లక్షణాలను బట్టి శరీరంలోని ఏ లోపం వలన జుట్టు రాలుతుంది అనేది తెలుసుకోవాలి. అదెలాగో తెలుసుకుందాం.

వర్షాకాలంలో జుట్టు రాలడం..

ట్వీక్ ఇండియా నివేధిక ప్రకాశం.. రోజులో 50-100 వెంట్రుకలు రాలిపోతే అది సాధారణమని వైద్యులు చెబుతున్నారు. అలాగే వర్షాకాలంలో దీని ప్రభావం మరింత పెరుగుతుంది. దీంతో ప్రతి రోజూ 200 వెంట్రుకల వరకు రాలిపోయే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో జుట్టు రాలడం 30 శాతం పెరుగుతుంది. ఈ సీజన్‏లో జుట్టు రాలిపోవడం సాధారణమే. కానీ మరి ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇందుకోసం మీరు ప్రతిరోజు మీ జుట్టు ఎంత రాలిపోతుందో గమనిస్తూ ఉండాలి.

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాతావరణంలో ఉంటే అధిక తేమ కారణంగా జుట్టు మూలాలు ఎక్కువగా హైడ్రోజన్‏ను గ్రహిస్తాయి. ఇది జుట్టును పెళుసుగా చేస్తుంది. దీంతో జుట్టు ఎక్కుగా రాలిపోతుంది. దీంతోపాటు.. తేమ కారణంగా జుట్టులోని సహజ నూనె లక్షణాలు తొలగిపోతాయి. దీనివలన మూలాలు బలహీనంగా మారిపోతాయి. స్కల్ కూడా దెబ్బతింటుంది. అందుకే వర్షంలో జుట్టును వదిలేయకూడదు. అలాగే రోజులో ఎక్కువ సార్లు జుట్టు తడపకూడదు.

Also Read: Actress Chandini: మాజీ మంత్రికి నటి చాందినీ షాక్.. రూ.10 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టులో దావా..!

RBI Good News: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై సెలవు రోజుల్లోనూ.!

Lakshya Friday: నాగశౌర్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… ఇకపై ప్రతీ శుక్రవారం ఒక అప్‌డేట్‌..