Monkeypox Diet: కలవరపెడుతోన్న మంకీపాక్స్‌.. ఈ సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఉత్తమం

|

Jul 24, 2022 | 7:32 PM

Health Care Tips: కరోనా మహమ్మారి ఇంకా కనుమరుగుకాకముందే మంకీపాక్స్‌ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. సుమారు 75 వేల దేశాల్లో సుమారు 16 వేల కేసులు నమోదవ్వడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతుంటడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా..

Monkeypox Diet: కలవరపెడుతోన్న మంకీపాక్స్‌.. ఈ సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఉత్తమం
Monkeypox
Follow us on

Health Care Tips: కరోనా మహమ్మారి ఇంకా కనుమరుగుకాకముందే మంకీపాక్స్‌ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. సుమారు 75 వేల దేశాల్లో సుమారు 16 వేల కేసులు నమోదవ్వడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతుంటడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇక భారత్‌లోనూ ఇప్పటివరకు నాలుగు కేసులు వెలుగుచూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ లక్షణాల గురించి మాట్లాడితే , చికెన్‌పాక్స్ వంటి చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. బాధితుల్లో అధిక జ్వరం కూడా ఉంటుంది. అయితే మంకీపాక్స్‌ బాధితులు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని వేగంగా పెంచే ఆహారం డైట్‌లో చేర్చుకుంటే ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు. మరి ఆ సూపర్‌ఫుడ్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి.

విటమిన్ సి ఫుడ్స్

రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే పలు వ్యాధులు దూరమవుతాయి. ఈక్రమంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు మంకీపాక్స్‌ను చాలా వరకు అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, దీనికి ఎటువంటి రుజువులు లేవు. కానీ విటమిన్ సి ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవచ్చు. ఇందుకోసం నిమ్మకాయ వంటి పుల్లగా ఉండే సిట్రస్‌ ఫుడ్స్‌ను బాగా తీసుకోవాలి. ఒకవేళ పుల్లటి పండ్లు నచ్చకపోతే బొప్పాయి వంటి తీపి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

తులసి ఆకులు

ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యముంది. ఎందుకంటే అవి ఔషధంగా పనిచేస్తాయి. తులసి ఆకులతో చేసిన పానియాలు, టీ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని వేగంగా పెంచుకోవచ్చు. ఇది వివిధ వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

పుదీనా

వంటల్లో రుచిని పెంచే పుదీనాను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది అనేక వ్యాధులకు నివారిణగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులకు ఇది మంచి ఆహారం. దీనితో తయారు చేసిన వాటిని తినడం వల్ల కండరాలలోని ఒత్తిడి తొలగిపోతుంది. అలాగే ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. కావాలంటే పుదీనాతో తయారుచేసిన హెర్బల్ టీని తాగొచ్చు. ఇది దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. ఈ పద్ధతులు పాటించేముందు డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

మరిన్నిహెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి