Mens health tips: చాలా మంది పురుషులకు రాత్రి వేళ నిద్రపోయేటప్పుడు బాగా చెమటలు పడుతుంటాయి. ఇలాంటి (Sweating) సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నప్పటికీ.. బయటకు చెప్పరు. నిద్రపోయే సమయంలో చెమటలు పడితే.. తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. దీని ప్రభావం మరుసటి రోజు కనిపిస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రత కోల్పోవడం, రోజంతా అలసట, నీరసం లాంటివి కనిపిస్తాయి. దీని ప్రభావం నేరుగా ఆరోగ్యంపై పడుతుంది. ఎందుకంటే రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే క్రమంగా ఒత్తిడి, ఆందోళనతో చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది. పురుషులు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు (sweating at night) చెమట పట్టడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, దానిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మగవారికి చెమట పట్టడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రపోతున్నప్పుడు పురుషులకు చెమట పట్టడానికి కారణాలు..
ఆందోళన లేదా ఒత్తిడి: జీవితంలో ఆందోళన లేదా ఒత్తిడితో ఇబ్బుందులు పడుతుంటే.. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎక్కువగా చెమటలు పట్టవచ్చు. మరోవైపు పని సమయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటే లేదా ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతుంటే.. దీని కారణంగా కూడా రాత్రిపూట చెమట పట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఒత్తిడిని నియంత్రించుకోవడానికి పలు చిట్కాలు అవలంభించాలి. ఎక్కువగా ఆలోచించడం మానేయాలి.
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్: (Gastroesophageal Reflux Disease)
రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు అధిక చెమటకు GERD కూడా కారణం కావచ్చు. ఈ సమయంలో మీ కడుపులోని యాసిడ్ అన్నవాహికలో పేరుకుపోతుంది. ఇది చికాకును కలిగిస్తుంది. ఇది గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. దీనివల్ల గుండెల్లో మంట, శ్వాస సమస్యలు వస్తాయి. దీని కారణంగా నిద్రిస్తున్నప్పుడు చెమట పడుతుంది.
టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గినా చెమట పడుతుంది..
శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయి తక్కువగా ఉంటే రాత్రిపూట చెమటలు పట్టవచ్చు. పెద్దయ్యాక శరీరం తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది.
ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే, నివారణ కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..