Green Almonds: వేసవి కాలంలో నానబెట్టిన బాదంపప్పులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొన్నిసార్లు రాత్రిపూట బాదంపప్పుని నానబెట్టడం మరిచిపోతుంటాం. అలాంటి సమయంలో పచ్చి బాదంపప్పుని తినడం ఉత్తమం. వేసవిలో పచ్చి బాదంపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. రోజూ కొన్ని బాదంపప్పులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి బాదంపప్పులలో చాలా పోషకాలు ఉంటాయి. కశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రజలు పచ్చి బాదంపప్పును సలాడ్‌లు, పానీయాల రూపంలో అధికంగా వినియోగిస్తారు. కొంతమంది పచ్చి బాదంపప్పుల ఊరగాయ కూడా చేస్తారు. పచ్చి బాదంపప్పు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఆకుపచ్చ బాదం ప్రయోజనాలు
1. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది: పచ్చి బాదంపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో pH స్థాయిని సమతుల్యం చేస్తాయి.
2. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: ఆకుపచ్చ బాదం గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, రక్తకణాలు పెరుగుతాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పచ్చి బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
3. జీవక్రియను పెంచుతుంది: పచ్చి బాదంపప్పు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. వీటిని తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. పచ్చి బాదం పొట్టకు మేలు చేస్తుంది. ఇవి శరీరానికి ఎటువంటి వేడిని కలిగించవు.
4. ఎముకలు, దంతాలను బలపరుస్తుంది: పచ్చి బాదంపప్పులో భాస్వరం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ దంతాలు, ఎముకలని బలంగా చేస్తుంది. పచ్చి బాదంపప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చిగుళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. నోరు కూడా శుభ్రంగా ఉండే విధంగా చేస్తాయి.
5. మధుమేహం రోగులకి మంచిది: పరగడుపున పచ్చి బాదంపప్పు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ తీసుకునే వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ముడి బాదం రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రిస్తుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.