Mustard Oil: మనం రోజూ తినే వంటకాల్లో నూనెను తప్పకుండా వినియోగిస్తుంటాం. అయితే మంచి నూనె వినియోగిస్తే.. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. లేదంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి నూనెలలో ముఖ్యంగా ఆవాల నూనె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవాల నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవాల నూనెలో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఒమేగా త్రీ, లెనో లినిక్ యాసిడ్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. ఇందులో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆవాల నూనెను రెగ్యూలర్‌గా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆవాల నూనె వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆవాలు నెలలో ఉండే మంచి ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది.
2. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలానే స్వెల్లింగ్ సమస్యలను తగ్గిస్తుంది.
3. దగ్గు, జలుబు, అలర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
4. ఆవాల నూనె యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.
5. రెడ్ బ్లడ్ సెల్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది.
6. ఆవాల నూనెతో పిల్లకు మసాజ్ చేస్తే వారి ఎముకలు దృఢంగా మారుతాయి.
7. జుట్టు పోషణలో అద్భుతంగా పని చేస్తుంది. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
8. ఆవాల నూనెతో మసాజ్ చేయడం ద్వారా చర్మ సమస్యలు దూరమవుతాయి.
Also read:
Sandalwood Face Mask: గ్లోయింగ్, ఫెయిర్ స్కిన్ కోసం శ్రీగంధం ఫేస్ ప్యాక్.. ఎలా తయారు చేయాలో తెలుసా..
Budget 2022: ఈ ఏడాది ‘ఆర్థిక సర్వే’ ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?