Lungs Cancer: మీకు దగ్గు కంటిన్యూగా కొనసాగుతుందా..? ఈ ప్రమాదకరమైన వ్యాధి కావచ్చు.. జాగ్రత్త

|

Aug 16, 2022 | 3:51 PM

Lungs Cancer: ఈ రోజుల్లో చాలా మంది వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల..

Lungs Cancer: మీకు దగ్గు కంటిన్యూగా కొనసాగుతుందా..? ఈ ప్రమాదకరమైన వ్యాధి కావచ్చు.. జాగ్రత్త
Lungs Cancer
Follow us on

Lungs Cancer: ఈ రోజుల్లో చాలా మంది వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడున్న బిజీలైఫ్‌లో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవడం, జీవన విధానాన్ని మార్చుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. క్యాన్సర్ శరీరంలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయగలిగినప్పటికీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా అత్యంత క్యాన్సర్ల జాబాతాలో చేర్చబడింది. పెరుగుతున్న కాలుష్యం, ధూమపానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ క్యాన్సర్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు మొదట్లోనే కనిపిస్తాయని, అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో వైద్యం కోసం వైద్యుల వద్దకు వెళ్లడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీని తరువాత ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది.

ఈ మధ్య కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ పల్మనాలజీ డైరెక్టర్, యూనిట్ హెడ్ డాక్టర్ రవి శేఖర్ ఝా తెలిపారు. ఇప్పుడు 40 ఏళ్ల లోపు వారిలో కూడా ఈ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. చాలా వరకు కేసులు అత్యాధునిక దశలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల రోగికి చికిత్స చేయడం చాలా కష్టమవుతుంది. ఈ క్యాన్సర్ కేసులు పురుషులలో ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు.

ధూమపానం ఒక పెద్ద కారణం
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం ధూమపాన అలవాట్లేనని డాక్టర్ ఝా చెప్పారు. అయితే ఇప్పుడు వాయుకాలుష్యం వల్ల కూడా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. స్వచ్ఛమైన గాలి, పారిశ్రామిక కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, హుక్కా, బీడీల వినియోగం మొదలైన వాటి వల్ల కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని కోసం ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించండి. ధూమపానం చేయవద్దు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి.

ఇవి కూడా చదవండి

నిరంతర దగ్గుపై శ్రద్ధ వహించండి

ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో అతి పెద్ద లక్షణం ఎడతెగని దగ్గు అని సీనియర్ వైద్యుడు డాక్టర్ కవల్‌జిత్ సింగ్ అంటున్నారు. అయితే దగ్గును పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు కలిగి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. దీంతో క్యాన్సర్ ముప్పును దూరం చేసుకోవచ్చు. దీనితో పాటు, TB వంటి అంటు వ్యాధిని కూడా గుర్తించవచ్చు.

ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు

☛ ఛాతీలో నొప్పి

☛ వేగవంతమైన బరువు

☛ రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు

☛ దగ్గులో రక్తం

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి