Health Tips: మీ వేళ్లు, గోళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.. వెంటనే చెక్ చేసుకోండి.. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు..!

Lung Cancer Symptoms: శరీరంలో అభివృద్ధి చెందుతున్న ప్రతి వ్యాధి కొన్ని సూచనలను ఇస్తుంది. అయితే, ఆ సంకేతాలు చాలా సాధారణం. వాటిని చిన్న సమస్యలుగా పరిగణించి తరచుగా విస్మరిస్తుంటారు. అయితే, వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల, వ్యాధి శరీరంలో వ్యాపించే, విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తీవ్రమైన, ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. దాదాపు ప్రతి రకమైన క్యాన్సర్ ప్రాణాంతకంగా పరిగణించబడుతుంది. అయితే, శరీరంలో కనిపించే లక్షణాల గురించి మొదట్లోనే..

Health Tips: మీ వేళ్లు, గోళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.. వెంటనే చెక్ చేసుకోండి.. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు..!
Lung Cancer Symptoms On Nails

Updated on: Aug 22, 2023 | 7:14 PM

శరీరంలో అభివృద్ధి చెందుతున్న ప్రతి వ్యాధి కొన్ని సూచనలను ఇస్తుంది. అయితే, ఆ సంకేతాలు చాలా సాధారణం. వాటిని చిన్న సమస్యలుగా పరిగణించి తరచుగా విస్మరిస్తుంటారు. అయితే, వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల, వ్యాధి శరీరంలో వ్యాపించే, విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తీవ్రమైన, ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. దాదాపు ప్రతి రకమైన క్యాన్సర్ ప్రాణాంతకంగా పరిగణించబడుతుంది. అయితే, శరీరంలో కనిపించే లక్షణాల గురించి మొదట్లోనే తెలుసుకుంటే.. ఈ వ్యాధిని కూడా ఆదిలోనే నిర్మూలించొచ్చు.

అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ‘ఊపిరితిత్తుల క్యాన్సర్’ అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇతర వ్యాధుల మాదిరిగానే, ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేక లక్షణాలు కూడా శరీరంలో కనిపిస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత వేగంగా వ్యాపించే క్యాన్సర్. క్యాన్సర్ కణాలు శరీరమంతా వ్యాపించినప్పుడు సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలు వేళ్లపై కూడా కనిపిస్తాయి..

ఊపిరితిత్తుల క్యాన్సర్ కొన్ని లక్షణాలు వేళ్లపై కూడా కనిపిస్తాయి. మీ గోళ్లను నొక్కినప్పుడు వజ్రం లాంటి కాంతి కనిపిస్తే.. అది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతంగా పేర్కొంటారు. వేళ్ల చివర్లలో వాపు ఉండవచ్చు. గోర్లు సాధారణం కంటే ఎక్కువగా తిరగడం జరుగుతుంది. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఆయా దశల్లో కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి మాత్రమే కాదు, చివరికి వేళ్లలోని మృదు కణజాలంలో ద్రవం చేరడం వల్ల, వేళ్లు పెద్దవిగా ఉండి, వాపు వస్తుంది.

ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండండి..

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తాయి. కొందరిలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఒక్క లక్షణం కూడా కనిపించదు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని త్వరగా గుర్తించి, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని త్వరగా నయం చేయవచ్చని చెబుతున్నారు నిపుణులు.

లక్షణాలివే..

1. నిరంతర దగ్గు, ఇది 3 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది.

2. శ్వాస ఆడకపోవడం

3. శ్వాసలోపం

4. తరచుగా ఛాతీ ఇన్ఫెక్షన్లు

5. తీవ్రమైన దగ్గు

6. ఛాతీ, భుజాలలో నొప్పి

7. దగ్గే సమయంలో రక్తం రావడం

8. కఫంలో రక్తం

9. భరించలేని అలసట

10. శక్తి లేకపోవడం

11. గొంతు బొంగురుపోవడం

12. ముఖం, మెడ వాపు

అయితే, శరీరంలో ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు. కొన్ని ఇతర కారణాల వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దాంతో సకాలంలో సమస్యను గుర్తించి, చికిత్స పొందవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న వార్తలోని అంశాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. వైద్యుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..