హైబీపీ కాదు.. లోబీపీ కూడా కొంపముంచుతుంది.. ఇలా చేస్తే ఛూమంత్రం వేసినట్లే..

హైపోటెన్షన్.. తక్కువ రక్తపోటు గుండె, మెదడు, మూత్రపిండాలు.. ఊపిరితిత్తులకు శత్రువు.. దీనిని నివారించడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం.. ఎక్కువ సేపు ఆహారం తీసుకోకపోతే.. అది మీ శరీరానికి చాలా హానికరంగా నిరూపించవచ్చని.. అటువంటి పరిస్థితిలో లోబీపీ సమస్య మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

హైబీపీ కాదు.. లోబీపీ కూడా కొంపముంచుతుంది.. ఇలా చేస్తే ఛూమంత్రం వేసినట్లే..
Low Blood Pressure

Updated on: Mar 04, 2025 | 4:11 PM

మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ రక్తపోటును సాధారణంగా ఉంచుకోవడం ముఖ్యం.. అది పెరిగినా లేదా తగ్గినా అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా మనం అధిక రక్తపోటు (హైబీపీ) గురించి మాట్లాడుకుంటాము.. దీనినే హైపర్ టెన్షన్‌గా పేర్కొంటారు.. అయితే.. చాలా మంది తక్కువ రక్తపోటుతో కూడా బాధపడుతుంటారు. సాధారణ రక్తపోటు 120/80 చుట్టూ ఉంటుంది.. కానీ అది 90/60 కి పడిపోతే హైపోటెన్షన్ సమస్య తలెత్తుతుంది.. ఇది ఆందోళన కలిగించే విషయం. అటువంటి పరిస్థితులలో, మీ గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. ఒక్కోసారి వైద్య అత్యవసర పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది.. అయితే.. కొన్ని ఆహార పదార్థాల వినియోగం వల్ల రక్తపోటు పెరుగుతుందని.. బ్లడ్ ప్రెజర్ ను సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో తెలుసుకోండి..

మీ బీపీ తక్కువగా ఉన్నప్పుడు ఇవి తినండి..

కాఫీ: మీరు ఎక్కువసేపు తిననప్పుడు.. రక్తపోటు తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వెంటనే కాఫీ తాగాలి.. ఎందుకంటే అందులో ఉండే కెఫిన్ బిపిని పెంచుతుంది.. వెంటనే దానిని సాధారణీకరిస్తుంది.. అంతేకాకుండా తక్షణ ఉపశమనం ఇస్తుంది.

ఉప్పు: తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఖచ్చితంగా ఉప్పు తినాలి. మీరు దీన్ని నిమ్మకాయ నీటితో లేదా ఏదైనా ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు.. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

బాదం: బాదం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు.. కానీ అది తక్కువ రక్తపోటును నియంత్రించగలదని మీకు తెలుసా..? దీని కోసం, రాత్రిపూట కొన్ని బాదంపప్పులను నీటిలో మరిగించి, చల్లబరిచి, మెత్తగా చేసి తినండి.. ఆ నీటిని కూడా తాగొచ్చు.. ఇలా చేయడం వల్ల బిపిని సాధారణీకరిస్తుంది.

నీరు: మీ శరీరంలో నీరు తక్కువగా ఉంటే.. అది రక్తపోటును తగ్గిస్తుంది. సాధారణంగా ఆరోగ్య నిపుణులు రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తారు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, మీరు కొబ్బరి లేదా నిమ్మకాయ నీరు త్రాగాలి..

తరచూ లోబీపీ సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.. వారు చెప్పిన విధంగా ఆహారం తీసుకోవడం ఉత్తమం..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..