Long covid: కరోనా నుంచి కోలుకున్నాక ఐదారు నెలల పాటు ఇబ్బందులు.. బయటపడుతున్న ‘లాంగ్‌ కోవిడ్‌’ కేసులు

|

May 31, 2021 | 1:53 PM

Long covid: భారత్‌తో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. అయితే కరోనా బారిన పడిన వారు తిరిగి కోలుకున్నాక మళ్లీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నట్లు పరిశోధనలలో తేలింది..

Long covid: కరోనా నుంచి కోలుకున్నాక ఐదారు నెలల పాటు ఇబ్బందులు.. బయటపడుతున్న లాంగ్‌ కోవిడ్‌ కేసులు
Long Covid
Follow us on

Long covid: భారత్‌తో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. అయితే కరోనా బారిన పడిన వారు తిరిగి కోలుకున్నాక మళ్లీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నట్లు పరిశోధనలలో తేలింది. ఇలాంటి వారు ఐదారు నెలల పాటు కరోనా లక్షణాలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొవడం ‘లాంగ్‌ కోవిడ్‌’ అనే పేరు పెట్టారు. దీనిపై ఢిల్లీ ఎయిమ్స్‌ కోవిడ్‌ వైద్య నిపుణులు డాక్టర్ నీరజ్‌ నిశ్చల్‌ మాట్లాడుతూ.. లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు చెందిన బాధితులు కూడా ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. అయితే బాధితులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా సుమారు ఐదారు నెలల పాటు వారిలో కోవిడ్‌ లక్షణాలు కనిస్తున్నాయన్నారు. కోవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.

స్వదేశంలో, విదేశాల్లో సుమారు 20 శాతం మంది రోగులు దీర్ఘకాలిక కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బాధితులు అధికంగా అలసటకు గురవుతారని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. కరోనా నుంచి కోలుకున్నవారిలో 11.8 శాతం బాధితులు తీవ్రమైన అలసటకు గురవుతున్నారని, 10.9 శాతం మందిలో దీర్ఘకాలిక కఫ లక్షణాలు, 6.4 శాతం మందిలో రుచి కోల్పోవడం, 6.3 శతం మంది సువాసన కోల్పోవడం, 6.2 శాతం మంది గొంతు నొప్పి, 5.6 శాతం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే ఎయిమ్స్‌లో లాంగ్‌ కోవిడ్‌ బాధితుల డేటాను సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్‌ నీరజ్‌ తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Corona Third Wave: వణికిస్తున్న థర్డ్‌వేవ్‌.. ఆ జిల్లాలో 8 వేల మంది చిన్నారులకు కోవిడ్‌.. పిల్లలనే టార్గెట్..!

Coronavirus: కరోనాను జయించి కోవిడ్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఒకే కుటుంబంలోని 26 మంది