Indians contracted HIV: కోవిడ్ కేసులు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా 2020 సంవత్సరంలో మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో పౌరులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, ఈ సమయంలో పెద్ద సంఖ్యలో భారతీయులు అనారోగ్యానికి గురయ్యారన్న నివేదికలు ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా RTI డేటా ప్రకారం, 2020-21 మధ్యకాలంలో అసురక్షిత లైంగిక కార్యకలాపాల కారణంగా దేశవ్యాప్తంగా 85,000 మందికి పైగా HIV బారిన పడ్డారు. లాక్‌డౌన్ కాలంలో అత్యధికంగా నమోదైన హెచ్‌ఐవీ కేసుల జాబితాలో మహారాష్ట్ర 10,498 కేసులు నమోదు అయ్యాయి. 9,521 మందికి ఇన్‌ఫెక్షన్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, కర్ణాటక 8,947 తర్వాతి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వరుసగా 3,037, 2,757 తరువాతి స్థానంలో HIV ఇన్ఫెక్షన్లతో జాబితాలో ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన RTIకి ప్రతిస్పందనగా, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) అసురక్షిత లైంగిక కార్యకలాపాల కారణంగా 2020-21లో దేశవ్యాప్తంగా 85,268 HIV కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డేటా ప్రకారం, 2011-12 నుండి 2020-21 మధ్య అసురక్షిత లైంగిక కార్యకలాపాల కారణంగా.. HIV కేసుల సంఖ్యలో స్థిరమైన క్షీణత గమనించవచ్చు. అయితే, ఈ సంఖ్య 2011-12లో 2.4 లక్షల హెచ్‌ఐవి కేసుల నుండి 2019-20లో 1.44 లక్షలకు తగ్గింది. ఇది 2020-21లో 85,268కి తగ్గిందని నివేదికలు చెబుతున్నారు.
Read Also…. Telangana: మతిస్థిమితం లేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం..