Health Benefits: డైటింగ్ చేసేవారు బెండకాయను తినోచ్చా ? దీనివల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసా..

|

Feb 17, 2021 | 8:54 PM

సాధరణంగా మనం వంటింట్లో వాడే కూరగాయల్లో బెండకాయ ఒకటి. దీనిని అనేక రకాల రెసిపీలను చేసుకుంటుంటాము. బెండకాయను తింటే జ్ఞాపకశక్తిని పెరుగుతుందని అంటుంటారు.

Health Benefits: డైటింగ్ చేసేవారు బెండకాయను తినోచ్చా ? దీనివల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసా..
Follow us on

సాధరణంగా మనం వంటింట్లో వాడే కూరగాయల్లో బెండకాయ ఒకటి. దీనిని అనేక రకాల రెసిపీలను చేసుకుంటుంటాము. బెండకాయను తింటే జ్ఞాపకశక్తిని పెరుగుతుందని అంటుంటారు. దీనితో ఈ ఒక్క ప్రయోజనమే కాదండోయ్. ఇంకా చాలా రకాల ఆరోగ్య లాభాలున్నాయి. బెండకాయలో ఉండే ఖనిజాలు, విటమిన్లు మరియు సేంద్రియ పదార్థాల వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఏ, బీ, సీ, డీ, ఈ మరియు కే కూడా ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్ మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం.

బెండకాయను రెగ్యులర్ డైట్‏లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే నీరు శాతాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు దీనిని తినడం వలన క్రమంగా ఫలితం కనిపిస్తుంది. ఏదో ఒక రెసిపీని బెండకాయ‏తో చేసుకుని తింటూ ఉండండి. దీంతో సులువుగా బరువు తగ్గవచ్చు. బెండకాయ లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టకుండా ఉంచుతుంది. అలానే ఎముకలను స్ట్రాంగ్‏గా తయారు చేయడానికి కూడా ఇది బాగా పనికొస్తుంది. కాబోయే తల్లులు దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పుట్టే పిల్లలు ఎముకలను స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. విటమిన్-ఏ లోపంతో బాధపడే వారు రెగ్యులర్ డైట్ లో బెండకాయ చేర్చండి. దీని వల్ల విటమిన్-ఎ అందుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేయడంలో బెండకాయ సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడమే కాక గుండె సంబంధిత వ్యాధులు దరిచేరనివ్వకుండా సహాయం చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

Also Read:

Sapota benefits: సపోటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..