సాధారణంగా ప్రతి వంటకంలో పసుపును వినియోగిస్తుంటాము. మన భారతదేశంలో పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో పలు చికిత్సలకు పసుపును ఉపయోగిస్తుంటారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ B6, ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, జింక్, మాంగనీస్, పొటాషియం ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే కర్కుమిన్ అనే మూలకం అనారోగ్య సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పసుపు.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకుంటే వారికి హాని జరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందామా.
కిడ్నీలో రాళ్లు… ఇతర శరీర భాగాల్లో రాళ్లు ఉన్నవారు పసుపును డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. వీరు ఎక్కువగా పసుపు తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే వీరు పసుపును తక్కువగా తీసుకోవాలి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపును పరిమితంగా తీసుకోవాలి. డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి రక్తం పలుచబడే మందులను ఇస్తారు. అటువంటి వారు పసుపును అధికంగా తీసుకోవడం వలన శరీరంలో రక్తం శాతం తగ్గుతుంది. దీంతో అనారోగ్యం సమస్య ఎక్కువవుతుంది.
పసుపు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. ముక్కు, ఇతర శరీర భాగాల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి. కామెర్ల సమస్య ఉన్నవారు పసుపు తినకూడదు. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా డాక్టర్ సలహా మేరకే పసుపును తీసుకోవాలి. ఒక టీస్పూన్ గ్రౌండ్ పసుపులో 170-190 mg కర్కుమిన్ ఉంటుంది. రోజుకు 400 mg కంటే తక్కువ లేదా 800 mg కంటే ఎక్కువ కర్కుమిన్ తీసుకోవడం సురక్షితం. అందువల్ల సాధారణ వ్యక్తులు, ఒక రోజులో 1 నుండి 3 టీస్పూన్ల పసుపును తీసుకోవచ్చు.
Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..
Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి