కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మం.. జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ కలబంద పుష్కలంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు అధికంగా ఉంటాయి. ఇందులో కెరోటిన్, సి, ఇ, బి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బిలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆయుర్వేదంలో కూడా మొటిమలు, కాలిన గాయాల నివారణకు అలొవెరా ఉపయోగంలో ఉంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడమే కాకుండా.. ముడతలు, మొటిమలు.. జుట్టు రాలడం.. చుండ్రు వంటి సమస్యలను నియంత్రిస్తుంది. ఇక శరీరంలో అధిక వేడి ఉన్నవారు రోజూ కలబందను తినడం వలన కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ శ్రుతిమించి తీసుకుంటే కూడా ప్రమదమే.. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉన్నవారు కలబందను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి… అలాగే… కొన్ని వ్యాధులు ఉన్నవారు అస్సలు తీసుకోవద్దు.
1. గర్బిణీలు కలబందను అస్సలు తీనవద్దు. ఇది గర్భాశయ సంకోచాలతో సమస్యలను కలిగిస్తుంది. అలాగే గర్బస్రావం, పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.
2. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా కలబందను తీసుకోవద్దు. ఇది మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. అలాగే.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు తీసుకోవద్దు…
3. గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు కలబందకు దూరంగా ఉండాలి…. ఈ సమస్య ఉన్నవారు కలబంద తీసుకుంటే సమస్య మరింతే పెరుగుతుంది.
4. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కలబంద తీసుకోవద్దు..ఒక వేళ తీనాలనుకుంటే ముందుగా డాక్టర్ సలహాలు తీసుకోవాలి.. కొన్నిసార్లు దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరం మరింత ఆడ్రినలిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, అటువంటి పరిస్థితిలో, హృదయ స్పందన సక్రమంగా లేని సమస్య ఉంది.
Also Read:
Raviteja: దసరా స్పెషల్ సర్ప్రైజ్.. రవితేజ ధమాకా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..