శరీరంలో ఇలాంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తున్నాయా ?.. అయితే మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..

|

Mar 01, 2022 | 10:44 AM

మనం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్స్, ప్రోటీన్స్, పోషకాలు, ఖనిజాలు అన్ని అతి ముఖ్యమైనవి. ముఖ్యంగా విటమిన్స్.. చర్మం, జుట్టు,

శరీరంలో ఇలాంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తున్నాయా ?.. అయితే మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
Vitamin A
Follow us on

మనం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్స్, ప్రోటీన్స్, పోషకాలు, ఖనిజాలు అన్ని అతి ముఖ్యమైనవి. ముఖ్యంగా విటమిన్స్.. చర్మం, జుట్టు, రోగ నిరోధక శక్తి విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందులో విటమిన్ ఎ ఒకటి. విటమిన్ ఎ .. ఆరోగ్యకరమైన కళ్లు.. చర్మం, జుట్టు, శారీరక సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ ఎ అనేది మనం తీసుకునే పోషకాహార పదార్థాల నుంచి లభిస్తుంది. మనం పోషకాహారాన్న సరిగ్గా తీసుకోనప్పుడు విటమిన్ ఎ లోపం ఏర్పడుతుంది. ఈ లోపం అనేది అంధత్వానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ఈ విటమిన్ ఎ లోపం అనేది తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విటమిన్ ఎ లోపం ఉంటే.. ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందామా.

విటమిన్ ఎ లోపం లక్షణాలు..
* రాత్రి అంధత్వం, కార్నియా పొడిబారడం, వాపు
* పొడి బారిన చర్మం
* తరచుగా అంటువ్యాధులు
* చర్మం చికాకు
* పొడి కంటి కార్నియా
* పిల్లల ఎముకల సరైన అభివృద్ధి లేకపోవడం
* సంతానలేమి సమస్య
నివేదికల ప్రకారం.. శరీరానికి తగినంత విటమిన్ ఎ లేనప్పుడు.. అనేక శారీరక సమస్యలు మొదలవుతాయి. కంటికి సంబంధించిన సమస్యలు.. రోగ నిరోధక శక్తి బలహీనపడడం.. జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు మరణానికి కూడా దారి తీయవచ్చు. జీర్ణకోశ వ్యాధులతో బాధపడేవారిలో కూడా విటమిన్ ఎ లోపం రావచ్చు. అలాంటి వారిలో విటమిన్ ఎ గ్రహించదు. ముఖ్యంగా విటమిన్ ఎ లోపం వలన కంటి సంబంధిత సమస్యలు వస్తాయి.

శరీరంలో విటమిన్ ఎ లేకపోవడం వల్ల పురుషులు, స్త్రీలలో వంధ్యత్వ సమస్యలు తలెత్తుతాయి. గర్భాధరణ సమయంలో ఇబ్బందులు కలుగుతాయి. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల చర్మం చాలా పొడిగా ఉంటుంది. దురద, వాపు, తామర సమస్యలు కలుగుతాయి. దీని వల్ల పెదవులు పొడిబారిపోతాయి .పిల్లల శారీరక ఎదుగుదల సరిగా జరగదు. వారి ఎముకలు బలంగా ఉండవు. విటమిన్ లోపం ఉన్నవారికి గాయాలు తొందరగా మానవు. విటమిన్ ఎ చర్మానికి ఆరోగ్యకరమైన విటమిన్. ఇది కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు, ముడతలు అనేక చర్మ సంబంధిత సమస్యలను కలిగించదు.

రక్తపరీక్ష చేసుకోవడం ద్వారా విటమిన్ ఎ లోపాన్ని గుర్తించవచ్చు. విటమిన్ ఎ లోపం ఉంటే.. పోషకాహారాలు.. సప్లిమెంట్స్ తీసుకోవాలి. చేపలు, కాడ్ లివర్ ఆయిల్, ఆకు కూరలు, గుమ్మడి కాయ, బత్తాయి, క్యారెట్, పాలకూర, పాల ఉత్పత్తులు, జున్ను, పాలు, ఫుల్ క్రీమ్ పాలు, మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, నేరేడు పండ్లు మొదలైనవ తీసుకోవాలి.

గమనిక:- ఈ కథనం కేవలం నివేదిక ఆధారంగా.. నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. పూర్తి సమచారం తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి.

Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..

Rashmika Mandanna: ఆ సినిమాలో కష్డపడితే.. ఈ మూవీ పిక్నిక్‏లా ఎంజాయ్ చేశా.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్..

Mishan Impossible : తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ విడుదలయ్యేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.