
ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా డయాబెటిస్ ప్రమాదకరంగా మారకుండా కొంత నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది గుండెపోటు వంటి ఇతర అనారోగ్యాలతో కూడా ముడిపడి ఉంటుంది. అసలు డయాబెటిస్ రాకుండా ముందే జాగ్రత్తపడటం చాలా మంచిది. అందుకోసం ప్రారంభంలోనే అంటే ఫ్రీడయాబెటిస్ దశలోనే దాని లక్షణాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి ద్వారా తలెత్తే ఇతర సమస్యలను నివారించవచ్చు. తరచుగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో డయాబెటిస్ దశ ప్రారంభమైనట్టు అనుమానించాల్సిందే.
ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా తొలగిస్తుంది. కాబట్టి తరచుగా దాహం వేయడం, యూరిన్‌కు వెళ్లాల్సి రావడం జరుగుతుంది. శరీర కణాలకు గ్లూకోజ్ సరిగ్గా చేరకపోవడం వల్ల అలసట, బలహీనత ఏర్పడతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే.. వెంటనే షుగర్ టెస్టు చేయించుకోవాలి. ఫ్రీ డయాబెటిస్ దశలోనే కేర్ తీసుకుంటే రిస్క్ తగ్గుతుంది. ఆకస్మాత్తుగా కొన్ని రోజుల్లోనే బరువు తగ్గితే అనుమానించాల్సిందే. ఎందుకంటే శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించలేకపోతే, కొవ్వును, అలాగే కండరాలను విచ్చిన్నం చేస్తుంది దీనివల్ల బరువు తగ్గుతారు.
శరీరం తగిన శక్తిని పొందలేనప్పుడు ఆకలి వేస్తుంది. తరచుగా అధిక ఆకలి వేస్తుంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే మీ శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించలేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అంటే డయాబెటిస్ డెవలప్ అవుతున్నదని అర్థం. దీంతో పాటు తరచుగా చర్మం పొడిబారడం, దురద లేదా గాయాలు త్వరగా మానకపోవడం, కంటి చూపు మసకబారడం వంటివి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల జరుగుతుంటాయి. దీంతో పాటు కాళ్లు, చేతుల్లో జలదరింపు, యూరినటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా సంభవిస్తుంటే ప్రీడయాబెటిస్, లేదా డయాబెటిస్ లక్షణాలుగా గుర్తించాలి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా షుగర్ వృద్ధి చెందవచ్చు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం, తరచుగా వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి