ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనుషుల్లో జీర్ణక్రియ సమస్య తలెత్తుతోంది. దీని కారణంగా వారి బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. రోజూ వేరుశెనగ తినడం వల్ల శరీరంలోని జీవక్రియలు మెరుగుపడుతాయి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు పొట్టను కూడా క్రమంగా తగ్గించేలా చేస్తుంది. వేరుశెనగ మనకు ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుందో తెలుసుకుందాం..
వేరుశనగలో అనేక పోషకాలు ఉన్నాయి
వేరుశెనగను ఫైబర్, విటమిన్ల మంచి మూలంగా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలోని కాల్షియం శరీరంలోని ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.
వేరుశనగ ప్రయోజనాలు
దీనిని ‘పేదల బాదం’ అని ఎందుకు అంటారు?
వేరుశెనగలో దాదాపు బాదంపప్పులో ఉండే పోషక విలువలు ఉన్నాయయి. బాదంపప్పుతో పోలిస్తే దీని ధర కూడా చాలా తక్కువ. అందుకే దీన్ని ‘పేదల పండు’ లేదా ‘పేదల బాదం’ అని పిలుస్తారు. కొంతమంది దీనిని ‘దేశీ జీడిపప్పు’ అని కూడా పిలుస్తారు.
వేరుశెనగలను ఇలా తినండి..
రాత్రి పడుకునే ముందు వేరుశెనగలను నీటిలో నానబెట్టి, ఆ తర్వాత మరుసటిరోజు చిరుతిండిగా తీసుకోండి. తినడానికి ముందు వేరుశెనగలో ఉన్న నీటిని వడబోసి తాగాలని గుర్తుంచుకోండి. దీనితో పాటు, రాత్రిపూట తినడం మానుకోండి. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి