జామకాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలును చేకూరుస్తాయి. ఇవి మార్కె్ట్లో విరివిగా లభిస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా జామకాయలను తినవచ్చు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఇవి చాలా మంచివి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో బరువును నియంత్రించడంలో జామకాయ సహయపడుతుంది. అలాగే పండును తీసుకోవడం వలన షుగర్ అదుపులో ఉంటుంది. అయితే షుగర్ పేషెంట్స్ చలికాలంలో జామకాయలను తినవచ్చా ? అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. జామకాయలు చలికాలంలో తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.
జామకాయలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. ఇవి తీసుకోవడం వలన రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే వీరికి జామఆకులు కూడా మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ ఆకుల టీ తాగడం వలన బ్లడ్ షుగర్ తగ్గుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జామలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఇందులో అనేక రకాల విటమిన్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వలన గుండె దెబ్బతినకుండా కాపాడతాయి. జామకాయలో ఉండే పొటాషియం, ఫైబర్ కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. జామకాయలు కడుపులో వచ్చే తిమ్మిరిని తగ్గిస్తుంది. అలాగే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పని తగ్గిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కానీ సీజన్ మారినప్పుడు రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. జామలో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. జామ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శక్తిని కూడా ఇస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇతర పండ్ల కంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. జామ గింజలు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read: Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్.. అశ్విని రేవంత్ లవ్‌స్టోరీ.. అప్పుడే పెద్ద సంచలనం..
Bigg Boss 5 Telugu: సిరి కత్తి పెట్టుకుని గేమ్ ఆడావ్.. అసలు పాయింట్ తీసిన సన్నీ.. చివరకు..