ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా.. చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్య ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం.. తగ్గడం వంటి సమస్యల గురించి అనేకసార్లు వింటున్నాం. అలాగే ఈ వ్యాధిని నియంత్రించడానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొందరు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు ఎక్కువగా సప్లిమెంట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఈ వ్యాధి నియంత్రణకు సరైన మార్గం కనిపించలేదు. దీంతో కేవలం సప్లిమెంట్స్ కారణంగానే రక్తంలో చెక్కెర శాతాన్ని నియంత్రించగలుతున్నాం. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనం ప్రకారం పెరుగు వంటి ప్రోబయెటిక్స్ షుగర్ పేషెంట్స్‌కు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం.. ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలున్నట్లుగా తెలీంది.
షుగర్ పేషెంట్స్ తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాగే మరికొన్ని ఆహార పదార్థాలను కూడా మానుకోవాల్సి ఉంటుంది. అయితే వీరు పెరుగు తీసుకోవచ్చా ? లేదా ? అనే సందేహాలు మాత్రం చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే తీసుకునే ఆహారం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. రోజూలో అధిక మొత్తంలో అన్నం తీసుకోవడంకూడా ప్రమాదమే అంటుంటారు. అయితే వీరు పెరుగు తినడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో వెల్లడైంది. ఇక వీరు కూరగాయలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు, ఎరుపు, నారింజలను తినడం వల్ల ఫైబర్ మాత్రమే కాకుండా, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు పండ్లు చిన్న పిండి పదార్థాలను అందించే మంచి స్నాక్ గా తీసుకోవచ్చు. ఫైబర్, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.