ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారతదేశాన్ని మధుమేహానికి కేంద్రంగా పిలుస్తున్నారు. డయాబెటిస్ అనేది ఒక వ్యాధి, దీనిని నియంత్రించకపోతే రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపినప్పుడు.. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో శరీరానికి తగినంత శక్తి లభించదు. శరీరం త్వరగా అలసిపోతుంది. ఇన్సులిన్ మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి.. డయాబెటిక్ రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఆహారంలో ఇటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు తీసుకోవడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో సహజ ఇన్సులిన్‌గా పనిచేసే కొన్ని ఆహారాలు ఉన్నాయి. మధుమేహ బాధితులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఈ 5 ఆహారాలను తీసుకుంటే మంచిది.
అవోకాడోలో నేచురల్ ఇన్సులిన్ : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అవకాడోలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ గ్లైసెమిక్ ఆహారం శరీరంలో సహజ ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. ఈ ఆహారాలు డయాబెటిక్ రోగులకు ఉత్తమమైనవి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
నట్స్ షుగర్ నియంత్రిస్తాయి: మధుమేహ బాధితులు షుగర్ కంట్రోల్ చేయడానికి నట్స్ తీసుకోవాలి. నట్స్‌లో జీడిపప్పు, వాల్‌నట్‌లు, బాదం, వేరుశెనగ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్‌తో కూడిన నట్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆలివ్, అవిసె గింజల నూనె ప్రయోజనకరమైనది: ఆలివ్, అవిసె గింజల నూనె మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఆలివ్ నూనెలో టైరోసోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత, మధుమేహాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లాగే అవిసె గింజల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవిసె గింజల నూనె, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఆలివ్ ఆయిల్ ఆహారం నుంచి గ్లూకోజ్‌ను జీర్ణం చేయడానికి పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
కొన్ని రకాల చేపల తినడం వల్ల..: ఆహారంలో హెర్రింగ్, సాల్మన్, సార్డినెస్ వంటి కొన్ని రకాల చేపలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు నాన్ వెజ్ తీసుకుంటే.. ఈ ఫిష్ వెరైటీలను వారానికి రెండు సార్లు తింటే మంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)