Raw Onion Benefits: వేసవిలో పచ్చి ఉల్లిపాయాలను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..

|

Apr 20, 2022 | 8:27 PM

ఉల్లిపాయాలు వంట రుచిని పెంచడమే కాకుండా... ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. అయితే చాలా మందికి పచ్చి

Raw Onion Benefits: వేసవిలో పచ్చి ఉల్లిపాయాలను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..
Raw Onion
Follow us on

ఉల్లిపాయాలు వంట రుచిని పెంచడమే కాకుండా… ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. అయితే చాలా మందికి పచ్చి ఉల్లిపాయలను తినే అలవాటు ఉంటుంది. సలాడ్, మిర్చిబజ్జి, స్ట్రీట్ ఫుడ్స్, బిర్యానీ తింటున్నప్పుడు ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలను తినడానికి ఇష్టపుడుతుంటారు. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో మజ్జిగతోపాటు పచ్చి ఉల్లిపాయలను తీసుకుంటారు. అయితే పచ్చి ఉల్లిపాయలు రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. సీజన్స్ మారుతున్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. ఇందులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇందులో మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఉండడం వలన ఎముకలు, గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. అంతేకాకుండా.. క్యాన్సర్, మధుమేహం నుంచి రక్షిస్తాయి.

ఇవే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. వేసవి కాలంలో ఆహారంలో పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తగ్గించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలను నిరోధించడానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. వేసవిలో పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయని.. అస్మా ఆలం, కన్సల్టింగ్ న్యూట్రిషనిస్ట్ మరియు డైటీషియన్ హిందుస్తా్న్ టైమ్స్ ఆంగ్లపత్రికకు తెలియజేశారు.

ఉల్లిపాయలలో క్యాన్సర్ వ్యాధిని తగ్గించే బలమైన రసాయనాలు ఉన్నాయి. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వంట రుచి పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉల్లిపాయలలో విటమిన్లు, ఖనిజాలు, మొక్కల రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయలు పురాతన కాలం నుండి తలనొప్పి, గుండె జబ్బులు , నోటిపూతలకు చికిత్స చేయడానికి ఉపయోగించినప్పుడు ఔషధ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఉల్లిపాయలో కేవలం 44 కేలరీలు మాత్రమే ఉంటాయి అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక పనితీరులో ముఖ్యమైన పోషకం. కొల్లాజెన్ ఏర్పడటం, కణజాల వైద్యం , ఐరన్ శోషణ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే పదార్ధం ఉంది. ఇది సహజ యాంటిహిస్టామైన్‌గా పనిచేస్తుంది. హిస్టమైన్ వల్ల చర్మం కీటకాలు కాటు, వేడి కారణంగా దద్దుర్లు ఏర్పడటానికి కారణమవుతుంది ఉల్లిపాయలు వేసవిలో తీసుకుంటే వేడిని తగ్గిస్తాయి.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు, ఇతర వెబ్ సైట్స్ అదారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: Ashokavanamlo Arjuna Kalyanam: ముప్పై ఏళ్ళు దాటిన అర్జునుడి పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న

అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..

KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!

Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..