Bone Health: ఈ ఆహార పదార్థాలు తింటున్నారా..? అయితే, మీ ఎముకలు గుల్ల అయినట్లే.. అవేంటంటే..?

|

Aug 28, 2022 | 1:05 PM

మారుతున్న కాలంతో పాటు మనం తినే విధానం కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి పోషకాహారం అందదు.

Bone Health: ఈ ఆహార పదార్థాలు తింటున్నారా..? అయితే, మీ ఎముకలు గుల్ల అయినట్లే.. అవేంటంటే..?
Bone Health Care
Follow us on

Calcium Deficiency: ప్రస్తుత కాలంలో ఎముకలు, కీళ్ల నొప్పులు సర్వసాధారణ సమస్యగా మారింది. ఉరుకుపరుగుల జీవితం కారణంగా చాలామంది ఆహారం, పానీయాల విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహించరు. మనలో చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తినకుండా.. ఏవేవో అప్పటికప్పుడు దొరికే ఆహారంతో సరిపెట్టుకుటుంటారు. అటువంటి పరిస్థితిలో.. ఎముకలు బలహీనమవుతాయని.. కీళ్ల నొప్పులు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు మనం తినే విధానం కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. జంక్ ఫుడ్ తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి పోషకాహారం అందదు. దానికి విరుద్ధంగా మన శరీరానికి హాని కలుగుతుంది. క్రమంగా అనారోగ్యం బారిన పడటంతోపాటు ఎముకలు బలహీనయి.. వీటికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా ఎముకల్లో బలం తగ్గిపోయి.. మరింత బలహీనంగా మారుతాయని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. అవేంటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  1. తీపి పదార్థాలు: తీపిని ఎక్కువగా తినడం ఎముకలకు అస్సలు మంచిది కాదు. ఇది మాత్రమే కాదు ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో మిఠాయిలు ఎక్కువగా తినేవారికి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
  2. సోడా: సోడా ఎంత హానికరమో అందరికీ తెలుసు. ఇది ఎముకలకు చాలా హాని చేస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మహిళల్లో తుంటి ఫ్రాక్చర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఎముకలు బలహీనంగా మారుతాయి.
  3. చికెన్: చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. కానీ చికెన్ ఎక్కువగా తింటే ఎముకల్లో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది క్రమంగా ఎముకలను కూడా దెబ్బతీస్తుంది.
  4. కెఫిన్: కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎముకల్లో బలం తగ్గిపోయి బలహీనమవుతాయి. శరీరంలోని కాల్షియాన్ని కెఫిన్ బయటకు పంపుతుంది. అందుకే సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..