Dates Benefits: చలికాలంలో ఖర్జురాలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా ? ప్రయోజనాలు తెలుసుకోండి..

|

Oct 31, 2021 | 1:00 PM

ఖర్జురాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల

Dates Benefits: చలికాలంలో ఖర్జురాలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా ? ప్రయోజనాలు తెలుసుకోండి..
Dates
Follow us on

ఖర్జురాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఖర్జూరాన్ని సాధారణంగా ఎండబెట్టి తింటారు. ఎండు ఖర్జూరంలో పోషక విలువలు పెరుగుతాయి. ఇందులో అత్తిపండ్లలో ఉన్నంత కేలరీలు ఉంటాయి. అలాగే చాలా కేలరీలు.. కార్పోహైడ్రేట్స్ నుంచి వస్తాయి. 100 గ్రాముల ఖర్జూరంలో 75 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది 277 కేలరీల శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఐరన్, విటమిన్ బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు.. కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువలన గుండె జబ్బులున్నవారికి మంచిది. అయితే ఇన్ని ప్రయోజనాలున్న ఖర్జూరాలను చలికాలంలో తినవచ్చా లేదో తెలుసుకుందామా.

అనేక కారణాల వలన మెదడులో ఇంటర్ లుకిన్ (IL-6) పదార్థం ఉండిపోతుంది. దీంతో మెదడు ఒక వైపు వాపుకు గురవుతుంది. ఖర్జూరాల వినియోగం IL-6ని పెంచుతుందని ఓ అధ్యాయనంలో తెలీంది. దీంతో మెదడు వాపు తగ్గుతుంది. అలాగే పెరిగిన IL-6 అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి, ఖర్జూరాల వినియోగం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరంలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, సెలీనియం ఎముకలను బలోపేతం చేస్తాయి.. ఖర్జూరాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు, ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఫ్రీ రాడికల్స్ కారణంగా కణాలు నాశనం అవుతాయి. ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మధుమేహం, అల్జీమర్స్ ప్రమాదాన్ని నివారించడంలో మేలు చేస్తుంది. అదేవిధంగా కెరోటినాయిడ్స్ ఆక్సిడెంట్లు కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.

Also Read: Bigg Boss 5 Telugu Elimination: ఈవారం ‏బిగ్‏బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది అతడే.. ఎవరంటే…

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ ఆ కారణంగానే చనిపోయాడా ? .. అసలు విషయాలు చెప్పిన వైద్యులు..

Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..