Kishmish Benefits: వ్యాధులను నయం చేసే ఎండుద్రాక్ష.. కిస్‏మిస్ ఎలా తింటే మంచిది ? నానబెట్టిన ద్రాక్షను తింటే ప్రయోజనాలు..

|

Jun 17, 2021 | 9:11 PM

ప్రస్తుతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రోగ నిరోధక పెంచుకోవడమే కాకుండా.. ఇతర వ్యాధుల భారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవాలి.

Kishmish Benefits: వ్యాధులను నయం చేసే ఎండుద్రాక్ష.. కిస్‏మిస్ ఎలా తింటే మంచిది ? నానబెట్టిన ద్రాక్షను తింటే ప్రయోజనాలు..
Kismis
Follow us on

ప్రస్తుతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రోగ నిరోధక పెంచుకోవడమే కాకుండా.. ఇతర వ్యాధుల భారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన పోషకాలున్న పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఎండుద్రాక్షలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులో చక్కెర, కేలరీలు, అధికంగా ఉంటాయి. అయితే ఈ కిస్ మిస్ ను ఎప్పుడు తినాలి ? ఎలా తినాలి ? అనే విషయాలను తెలుసుకోవడం కూడా ముఖ్యమే. మరి ద్రాక్షను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందామా.

ఎండుద్రాక్ష ఎప్పుడు తినాలంటే..
ఎండుద్రాక్షను ఎప్పుడైన తినవచ్చు. కానీ నానబెట్టిన ఎండుద్రాక్ష ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. నానబెట్టిన ద్రాక్షను తినడం వలన పోషక విలువ పెరుగుతుంది.

నాన బెట్టిన ఎండుద్రాక్షను ఎందుకు తినాలి..
ఎండుద్రాక్ష కంటే నానబెట్టిన ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నానబెట్టిన ద్రాక్ష నీటిని తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే.. ద్రాక్షలో ఉంటే పోషకాలన్ని ఆ నీటిలో కరిగిపోతాయి. అందుకే ఆ నీటిని తాగడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ప్రయోజనాలు..
ఇందులో చెక్కర అధికంగా ఉంటుంది. శరీరంలో షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. కానీ ఇందులో ఎక్కువగా కేలరీలు ఉండవు. ఫలితంగా బరువు తగ్గడానికి కూడా సహయపడుతుంది. ఇందులో ఐరన్, బి కాంప్లెక్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతోపాటు.. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన నీటిలో నానబెట్టి తీసుకుంటే ఔషదంగా పనిచేస్తాయి. అలాగే కడుపును శుభ్రపరిచి మలబద్ధకం సమస్యను తొలగిస్తాయి. రోజూ వీటిని తీసుకోవడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే సోడియం మొత్తాన్ని నియంత్రిస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ ఉండడం వలన నోటి దుర్వాసన , శరీర దుర్వాసనను తగ్గిస్తుంది.

Also Read: Rythu bandhu : వ్యవసాయానికి అందుకే కేసీఆర్ అంతగా ఊతమిస్తున్నారు.. 4 రోజులలో రైతుబంధు కింద రూ. 4,095.77 కోట్లు జమ : మంత్రి

Political Violence: ఎన్నికల అనంతరం హింసా.. అది బీజేపీ జిమ్మిక్ హింస మాత్రమే..వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ