Parenting Tips: వర్షాకాలంలో ప్రబలుతోన్న వైరల్‌ జ్వరాలు.. మీ పిల్లలను కాపాడుకోండిలా..

|

Aug 13, 2022 | 4:55 PM

Fever in Kids: సాధారణంగా ప్రతి పేరెంట్‌ తమ పిల్లలను బాగా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా వర్షాకాలంలో. .

Parenting Tips: వర్షాకాలంలో ప్రబలుతోన్న వైరల్‌ జ్వరాలు.. మీ పిల్లలను కాపాడుకోండిలా..
Child Care Tips
Follow us on

Fever in Kids: సాధారణంగా ప్రతి పేరెంట్‌ తమ పిల్లలను బాగా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా వర్షాకాలంలో. . వాతావరణంలోని అనూహ్య మార్పులు పిల్లల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. దీనికి తోడు పిల్లలు ఎక్కువగా బయట తినడం కారణంగా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ సీజన్‌లో తరచూ వైరల్‌ జ్వరాల బారిన పడుతుంటారు. కేవలం పిల్లలే కాదు పెద్దలు కూడా తరచూ ఈ వైరల్ ఫీవర్ల బారిన పడుతుంటారు. మరి అలాంటప్పుడు పిల్లల పోషణకు సంబంధించి అదనపు జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

  • ఉదయం నిద్రలేచిన వెంటనే, పిల్లలను ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉంచవద్దు. అతనికి ఇష్టం లేకపోయినా లేదా వాంతులు అనే భయం అతన్ని వెంటాడుతున్నప్పటికీ, అతనికి ఏదో ఒకటి తినిపించండి. చాలా తేలికగా జీర్ణమయ్యే బ్రేక్‌ఫాస్ట్‌ను ఆహారంగా అందించాలి.
  • అల్పాహారంలో ఓట్‌మీల్‌తో పాటు రోస్ట్ చేసిన బ్రెడ్, ఓట్స్ లేదా కార్న్ ఫ్లేక్స్ తినడానికి ఇవ్వవచ్చు. అల్పాహారం ఎంత ఆరోగ్యకరంగా ఉంటే అంత త్వరగా పిల్లలు కోలుకుంటారు. అంతేకాదు ఇది పిల్లల్లో తక్షణ శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా జ్వరాల నుంచి త్వరగా కోలుకునే ఆస్కారముంది.
  • బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత, రెండు గంటల గ్యాప్ తీసుకుని, ఆపై పండ్లను కట్ చేసి పిల్లలకు తినిపించండి. అయితే ఈ పండ్లు అప్పటికప్పుడు కట్‌ చేసి ఇవ్వాలి. ముందే కట్‌ చేసిన పండ్లు తినిపించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
  •  మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పప్పు, పచ్చి కూరగాయలు తినిపించాలి. సన్నటి ఫుల్కాలను తయారు చేసి కనీసం రెండింటినీ ఇవ్వాలి. ఇక టేస్టీ ఫుడ్‌ కావాలంటే పండ్లతో తయారుచేసిన సలాడ్లు ఇవ్వచ్చు.
  •  భోజనం చేసిన తర్వాత పిల్లవాడిని బాగా నిద్రపోయేలా చేయండి. స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంచండి. వీలైనంతవరకు విశ్రాంతి తీసుకునేలా చూడాలి. అప్పుడే జ్వరం త్వరగా తగ్గుతుంది.
  •  పిల్లలకు సాయంత్రం పూట గోరువెచ్చని పాలు ఇవ్వండి. అలాగే రాత్రి భోజనంలో తినడానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారం అందించండి. అలాగే భోజనం చేసిన అరగంట తర్వాత జ్వరం తగ్గడానికి వైద్యులు సూచించిన మందులు ఇవ్వండి. వీలైతే, నిద్రపోయే ముందు కూడా అర గ్లాసు గోరువెచ్చని పాలు ఇవ్వాలి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. యోగ నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే యోగ నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం