Benefits Of Onion Juice: ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయలేదు.. అని సామేత కూడా ఉంది. అందుకే ఉల్లి మేలును ప్రతిఒక్కరు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ముఖ్యంగా తెలుసుకోవాలంటున్నారు. అయితే.. ఉల్లిపాయ రసం ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. ఉల్లిపాయ రసం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ జ్యూస్‌ని అప్లై చేస్తే.. ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. ఉల్లిపాయ రసంలో యాంటీ అలర్జిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల అనేక ప్రధాన వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడమే కాకుండా, కిడ్నీ స్టోన్ నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కిడ్నీ నొప్పి..
జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కిడ్నీలు (నడుము), ఉదరం భాగంలో నొప్పితో సతమతమవుతుంటారు. కిడ్నీల్లో రాళ్లు ఉండి నొప్పితో బాధపడుతుంటే దాని నుంచి ఉపశమనం పొందేందుకు ఉల్లిపాయ వినియోగం ప్రభావవంతంగా ఉంటుంది. అలాంటి వారు ఉల్లిపాయ రసం తీసుకోవడం ఉత్తమం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగితే రాళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్ చేస్తుంది
ఉల్లిపాయలో యాంటీ అలర్జిక్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ కార్సినోజెనిక్ వంటి అనేక ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒక నియమం ప్రకారం ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే మీరు సులభంగా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా బ్యాలెన్స్‌గా ఉంచుకోవచ్చు.
రోగనిరోధక శక్తి బలోపేతం
ప్రజలు తరచుగా పచ్చి ఉల్లిపాయలను తినడానికి ఇష్టపడతారు. ఇది ఆరోగ్యాని చాలా మంచిది. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
చలి నుంచి ఉపశమనం
శీతాకాలంలో జలుబు సమస్య తరచుగా వేధిస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో ఉల్లిపాయను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీరు పచ్చి ఉల్లిపాయ లేదా దాని రసాన్ని తప్పనిసరిగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పుల ఉపశమనం
కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి కూడా ఉల్లిపాయ మేలు చేస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ రసంతోపాటు ఆవాల నూనెతో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తొలగిపోతాయి.
Also Read: