Fever and cough: వదలని దగ్గు, వీడనీ జ్వరం దేనికి సంకేతం? హెచ్3ఎన్2, కరోనాకు మధ్య తేడా ఏంటి? వివరాలు తెలుసుకోండి..

|

Mar 20, 2023 | 1:42 PM

మీకు కలిగిన సుస్తీ దేనివల్ల వచ్చిందో నిర్ధారించడం ఎలా? మీకు వచ్చిన జ్వరం హెచ్3ఎన్2 వైరస్ కారణంగా వచ్చిన ఇన్ ఫ్లూయెంజానా? లేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన కరోనానా? హెచ్1ఎన్1 వైరస్ వల్ల వచ్చిన స్వైన్ ఫ్లూ నా? తెలుసుకోవడం ఎలా?

Fever and cough: వదలని దగ్గు, వీడనీ జ్వరం దేనికి సంకేతం? హెచ్3ఎన్2, కరోనాకు మధ్య తేడా ఏంటి? వివరాలు తెలుసుకోండి..
Cough And Cold
Follow us on

దేశ వ్యాప్తంగా ఇన్ ఫ్లూయెంజా హెచ్3ఎన్2 వైరస్ ప్రబలుతోంది. అన్ని రాష్ట్రంలోనూ దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. దీని సాధారణ లక్షణాలు దగ్గు, ఒళ్లు నొప్పులు, ఫీవర్, గొంతు నొప్పి వంటివి ఉంటున్నాయి. అయితే ఈ లక్షణాలు కరోనా వైరల్ కు ఉంటుండటంతో ఏది ఇన్ ఫ్లూయెంజా, ఏది కోవిడ్ 19 అనేది జనాలు తెలియడం లేదు. ఇంకొందరిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. వీటికి చికిత్సలు మాత్రం వేరువేరుగా ఉంటున్నాయి. ఒకటి దానికొకటి మందులు వాడితే అదుపు కానీ పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో మనకు కలిగిన సుస్తీ దేనివల్ల వచ్చిందో నిర్ధారించడం ఎలా? మీకు వచ్చిన జ్వరం హెచ్3ఎన్2 వైరస్ కారణంగా వచ్చిన ఇన్ ఫ్లూయెంజానా? లేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన ఎక్స్ బీబీ.1.16, ఎక్స్ బీబీ.1.5 కారణంగా వచ్చిన కరోనానా? తెలుసుకోవడం ఎలా?

ఐసీఎంఆర్ ఏం చెబుతోందంటే..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డేటా ప్రకారం.. దేశంలో వివిధ రకాల వైరస్లు ప్రజలపై దాడి చేస్తున్నాయి. వాటిల్లో కోవిడ్ 19, స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), సీజనల్ ఫ్లూ అయిన ఇన్ ఫ్లూయెంజా బీ ఉన్నాయి. ఇవి వేగంగా విస్తరిస్తున్నాయి.

ఇన్ ఫ్లూయెంజా ఏ రకం వైరస్ లైన హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 లను సాధారణంగా ఫ్లూ అని అంటారు. ఇది మనిషి శరీరంలో ప్రవేశించినప్పుడు సాధారణంగా జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస ఆడటంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

ఇవి కూడా చదవండి

కోవిడ్ కూడా.. నాలుగు నెలల కాలంలో 700లకు పైగా కోవిడ్ కేసులు కూడా దేశంలో నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసులు 4,623 ఉన్నట్లు యూనియల్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది.

మరి గుర్తించడం ఎలా..

అయితే ఈ మూడు వైరస్ లలో దేనికారణంగా మనిషి ఇబ్బంది పడుతున్నాడు అనేది చెప్పడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి నిర్ధారించలేమని స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం పరీక్ష కేంద్రాలలో రోగి శ్వాబ్ లను పరీక్షించడం ద్వారా మాత్రమే నిర్ధారించగలమని వివరిస్తున్నారు. అయితే కొన్ని ప్రాథమిక లక్షణాలను బట్టి ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

కోవిడ్ లక్షణాలు 2 నుంచి 3 రోజుల్లో తగ్గిపోతాయి. రోగి త్వరితగతిన కోలుకొనే అవకాశం ఉంటుంది. అయితే హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 మాత్రం చాలా రోజులు ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కఫంతో కూడిన దగ్గు కొన్ని వారాలా పాటు ఉండే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..