Blood Pressure: బీపీ బాధితులకు అలర్ట్.. టీ తాగుతున్నారా..? ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..

| Edited By: Ravi Kiran

Mar 29, 2022 | 7:44 AM

High Blood Pressure: నేటి జీవనశైలిలో అధిక రక్తపోటు అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది బ్లడ్ ప్రెజర్ (బీపీ) సమస్యతో బాధపడుతున్నారని

Blood Pressure: బీపీ బాధితులకు అలర్ట్.. టీ తాగుతున్నారా..? ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
Tea
Follow us on

High Blood Pressure: నేటి జీవనశైలిలో అధిక రక్తపోటు అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది బ్లడ్ ప్రెజర్ (బీపీ) సమస్యతో బాధపడుతున్నారని పలు అధ్యయానాల్లో తేలింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, నీరు సరిగా తాగకపోవడం, అలాగే ఎక్కువ ఒత్తిడికి గురికావడం వల్ల ఈ సమస్య వస్తుంది. రక్తపోటు ఉన్నప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు తమ ఆహారంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. తద్వారా వారి బీపీ అదుపులో ఉంటుంది. అలాగే ఆహారంలో ఉప్పును పూర్తిగా తగ్గించాలి. అయితే.. బీపీ ఉన్న వారు టీ (Tea) తాగాలా..? లేక మానేయాలా..? అనే సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. అయితే.. టీ తాగాలో లేదా ఇప్పుడు తెలుసుకోండి.

టీ తాగడం మంచిదేనా..?

  • టీ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగదని, అయితే ఇతర సమస్యలతో బాధపడేవాళ్లు మాత్రం డాక్లర్లను సంప్రదించిన అనంతరం తాగడం మంచిది. ఇతర సమస్యలతో బాధపడేవారు హైబీపీలో టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
  • అధిక రక్తపోటు ఉన్నవారికి ఎసిడిటీ సమస్య ఉంటే టీ అస్సలు తాగకూడదు.
  • అధిక రక్తపోటు ఉన్నవారు ఆందోళన, ఒత్తిడి ఉంటే టీ తాగకూడదు. టీ తాగితే బీపీ పెరిగే అవకాశం ఉంది.
  • అధిక రక్తపోటు ఉన్నవారు మూత్ర విసర్జనలో మంటగా ఉన్నట్లయితే అలాంటి వారు టీకి దూరంగా ఉండాలి. టీ ఎక్కువగా తాగడం వల్ల ఛాతీ, పొట్టలో మంట వస్తుంది.
  • ఏ వ్యక్తి కూడా ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. రక్తపోటు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల దాని స్థాయి పెరుగుతుంది. ఈ స్థితిలో ఛాతీలో మంట వస్తుంది.

రక్తపోటును ఇలా నియంత్రించండి..

  • అధిక రక్తపోటు ఉన్న రోగులు కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోరాదు. కెఫీన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల బీపీ రోగులకు హాని కలుగుతుంది.
  • రక్తపోటు రోగులు వారి ఆహారంలో ఉప్పు- సోడియం తక్కువగా ఉండాలి. ఉప్పు – సోడియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపు లేకుండా పోతుంది. ఉప్పును తక్కువ మోతాదులో తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
  • చిప్స్, ఊరగాయలు మొదలైన ప్యాక్డ్ ఫుడ్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటికి దూరంగా ఉండాలి.
  • ధూమపానం, మద్యం సేవించడం మానుకోండి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
  • బీపీని అదుపులో ఉంచుకోవాలంటే ప్రాణాయామం, యోగా, వ్యాయామం వంటివి తప్పనిసరిగా చేయడం మంచిది.
  • సాధారణంగా రక్తపోటు 120/80MMHg ఉండాలి. రక్తపోటు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత, తలనొప్పి, ఛాతీ నొప్పి లాంటివి కనిపిస్తాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సూచనలను టీవీ9 నిర్ధారించడంలేదు. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. వీటిని అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Also Read:

Milk Side Effects: ఈ పదార్థాలను పాలతో కలిపి తీసుకుంటున్నారా.. అయితే వెంటనే మానేయండి..

Summer Drinks: వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఈ 5 దేశీ డ్రింక్స్‌ సూపర్..!