Health Tips: మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుందో తెలిస్తే షాకే.. ఇంకోసారి..

చాలా మంది సాధారణంగా మధ్యాహ్నం 2-3 గంటలు నిద్రపోతారు. కొందరు భోజనం తర్వాత ఒక చిన్న కునుకు తీస్తారు. కానీ మధ్యాహ్నం నిద్రపోవడం మీ ఆరోగ్యానికి మంచిదా..? లేక హానికరమా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుందో తెలిస్తే షాకే.. ఇంకోసారి..
Who Should Avoid Afternoon Sleep

Updated on: Oct 17, 2025 | 8:12 PM

మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా పనుల మధ్యలో కాసేపు కునుకు తీయడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు, రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారు పవర్ న్యాప్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే కొందరికి మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదని అనిపిస్తే.. మరికొందరు అది హానికరం అని భావిస్తారు. ఈ నేపథ్యంలో అసలు మధ్యాహ్నం నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరమా లేక నష్టమా అనేదానిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

 20-30 నిమిషాల కునుకు వరం..

ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన పల్మనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనిమేష్ ఆర్య మధ్యాహ్నం నిద్ర గురించి వివరించారు.
డాక్టర్ అనిమేష్ ఆర్య ప్రకారం.. 20 నుండి 30 నిమిషాల పాటు ఒక చిన్న నిద్ర తీసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చిన్న నిద్ర మన శరీరం, మనస్సు రెండింటినీ విశ్రాంతిని ఇచ్చి ఏకాగ్రత స్థాయిలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. మధ్యాహ్నం నిద్ర రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఎవరు నిద్రపోకూడదు..? నిద్ర నియమాలు ఏంటి..?

మధ్యాహ్నం నిద్ర ప్రయోజనకరంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం.

  • నిద్ర సమయం : మధ్యాహ్నం నిద్ర ఒక గంట కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువసేపు నిద్రపోవడం రాత్రిపూట నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
  • సరైన వేళ: మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య నిద్రించడానికి ప్రయత్నించండి.
  • ఎవరు దూరంగా ఉండాలి?: నిద్రలేమి, మధుమేహం లేదా గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించకుండా మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి.

నిద్ర నాణ్యతను పెంచడానికి మార్గాలు

మనసుకు, శరీరానికి ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఒకవేళ మీ నిద్ర నాణ్యత సరిగా లేకపోతే, నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి:

యోగా – ప్రాణాయామం: బాలసనం, శవాసనం, అనులోమ్-విలోమ్, భ్రమరి ప్రాణాయామం వంటి భంగిమలను ప్రాక్టీస్ చేయండి. ఇవి ఒత్తిడిని తగ్గించి, నిద్రకు సహాయపడతాయి.

స్క్రీన్ టైమ్ తగ్గించండి: నిద్రవేళకు ఒక గంట ముందు మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించకుండా ఉండండి.

కెఫిన్ నివారించండి: రాత్రిపూట కాఫీ, టీ వంటి కెఫిన్ ఉన్న డ్రింక్స్ తాగడం మానుకోండి.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధ్యాహ్నం నిద్ర ప్రయోజనాలను పొందుతూనే, రాత్రిపూట మంచి నిద్రను పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..