International No Diet Day 2022: అంతర్జాతీయ నో డైట్ డే ప్రతి సంవత్సరం మే 6 న జరుపుకుంటారు. ఈ రోజు కొంతమంది ‘చీట్ డే’గా కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ఇష్టమైన ఆహారం ఏదైనా తినవచ్చు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దానిని సమతుల్యం చేసుకోవాలి. మీరు ఆహారం తీసుకోవడం సమతుల్యం చేసుకుంటే ఎప్పుడైనా చీట్ డేని జరుపుకోవచ్చు. మరియు అపరాధభావం లేకుండా నచ్చిన ఆహారాలని తినవచ్చు. ఈరోజు ఇంటర్నేషనల్ నో డైట్ డే సందర్భంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి అన్ని సమస్యలను దూరం చేసుకోవడానికి డైట్ ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం.
ఒకేసారి చాలా ఆహారం తినవద్దు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రజలు సాధారణంగా ఒకే సమయంలో చాలా ఆహారాన్ని తింటారు. దీంతో ఊబకాయం బారిన పడుతారు. అందుకే ఒకేసారి ఎక్కువ తినకుండా రెండు, మూడుసార్లు తినాలి. దీనివల్ల కొవ్వు త్వరగా పెరగదు.
తినే విధానం ఇలా ఉండాలి
ఉదయం నీరు తాగి ప్రారంభించాలి . సిప్ బై సిప్ నీరు తాగాలి. ఇది మీ పొట్టను క్లియర్ చేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్‌ని బయటకు పంపుతుంది. ఫ్రెష్ అయ్యాక గ్రీన్ టీ లేదా లెమన్ టీ తీసుకోవచ్చు. ఇందులో చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించాలి. మీరు సాధారణ టీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రెండు బిస్కెట్లు లేదా టోస్ట్ మొదలైనవి ముందుగా తినాలి. పరగడుపున టీ తాగవద్దు. సీజన్‌ను బట్టి వివిధ రకాల పండ్లు మార్కెట్‌లోకి వస్తాయి. ప్రతిరోజు రకరకాల పండ్లు తినాలి. అన్ని పండ్లను కలిపి మాత్రం తినకూడదు.
వేసవిలో పుచ్చకాయ రసం తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. శరీరంలో నీటి కొరతను తగ్గిస్తుంది. పండు తిన్న రెండు గంటల తర్వాత పుచ్చకాయ రసం తీసుకోవచ్చు. అందులో పుదీనా, నల్ల ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండాలి. మీకు కావాలంటే ఏదైనా ఇతర సీజనల్ జ్యూస్ కూడా తాగవచ్చు. మధ్యాహ్న భోజనంలో రెండు చపాతీలు, పప్పు, కూరగాయలు, పెరుగు మొదలైనవి తినండి. రాత్రిపూట బరువైన కూరగాయలు తీసుకునే బదులు, సొరకాయ, పప్పు, రెండు చపాతీలు తీసుకోవాలి. రాత్రి పడుకునే అరగంట ముందు ఒక కప్పు నాన్-క్రీమ్ మిల్క్ తీసుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి