Onion: తొక్కే కదా అని చిన్న చూపు చూసేరు.. ఉల్లి తొక్కతో ఎన్ని లాభాలో తెలిస్తే

|

Sep 28, 2024 | 4:08 PM

ఏ వంటగదిలోనైనా ఉల్లి ఘుమఘుమలు గుప్పుమని రావాల్సిందే. ఇక వంటలో ఉల్లి మరింత రుచిని అద్దేలా చేస్తుంది. ఇక ఉల్లిపాయలు తినడానికి ఎక్కువగా ఇష్టపడేవారు.. తొక్కే కదా అని వాటి తొక్కలను ఎందుకూ పనిరావని పారేస్తున్నారా.? కొంచెం ఆగండి.!

Onion: తొక్కే కదా అని చిన్న చూపు చూసేరు.. ఉల్లి తొక్కతో ఎన్ని లాభాలో తెలిస్తే
Onions
Follow us on

ఏ వంటగదిలోనైనా ఉల్లి ఘుమఘుమలు గుప్పుమని రావాల్సిందే. ఇక వంటలో ఉల్లి మరింత రుచిని అద్దేలా చేస్తుంది. ఇక ఉల్లిపాయలు తినడానికి ఎక్కువగా ఇష్టపడేవారు.. తొక్కే కదా అని వాటి తొక్కలను ఎందుకూ పనిరావని పారేస్తున్నారా.? కొంచెం ఆగండి.! ఉల్లి మాదిరిగానే ఉల్లిపాయ తొక్క కూడా పోషకాల గని. ఉల్లిపాయ తొక్కలో కూడా అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ఉల్లిపాయ తొక్కల్లో లభిస్తాయి.

ఉల్లిపాయ తొక్క జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది..

ముందుగా ఈ ఉల్లిపాయ తొక్కలను కడిగి నీళ్లలో వేసి మరిగించి, ఆ తర్వాత చల్లారిన నీటిని తలకు పట్టించి కాసేపు మసాజ్ చేసి జుట్టును బాగా కడగాలి. ఇది చుండ్రు సమస్యను నయం చేస్తుంది. లేదంటే ఉల్లి తొక్కలను ఉడికించిన నీటిలో కలబందను కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా దూరమవుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. మీరు ఉల్లిపాయ తొక్కను మిక్సీలో మెత్తగా పొడి చేసి, కలబందతో కూడా కలపవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

చర్మం కోసం ఉల్లిపాయ తొక్క:

ఉల్లిపాయ తొక్కలో విటమిన్లు ఎ, సి, ఈ పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి ఇది మీ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉల్లిపాయ తొక్కతో చిటికెడు పసుపు కలిపి.. ఆ పేస్ట్‌లో కొద్దిగా నీరు కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖంపై మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

దోమలను తరిమికొడుతుంది:

ఉల్లిపాయ తొక్క వాసన ఈగలు, దోమలను తరిమికొడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయ తొక్కను నీటిలో నానబెట్టి.. ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో ఉంచాలి. ఈ నీటిని ఈగలు, దోమలు ఎక్కువగా ఉండే చోట పిచికారీ చేయడం ద్వారా వాటిని ఈజీగా తరిమికొట్టొచ్చు. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

ఇది చదవండి: గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా.? వైద్యులు ఏం చెబుతున్నారంటే

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి