Covid-19: కోవిడ్‌కు చెక్ పెట్టేదిశగా ఆయుర్వేదం.. అశ్వగంధతో ఔషధం.. యూకేలో క్లినికల్ ట్రయల్స్‌

|

Aug 02, 2021 | 11:24 AM

Covid-19: ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేదం. భారత దేశంలో అతిపురాతన వైద్య విధానం.. ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని..

Covid-19: కోవిడ్‌కు చెక్ పెట్టేదిశగా ఆయుర్వేదం.. అశ్వగంధతో ఔషధం.. యూకేలో క్లినికల్ ట్రయల్స్‌
Ashwagandha
Follow us on

Covid-19: ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేదం. భారత దేశంలో అతిపురాతన వైద్య విధానం.. ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ప్రకృతిలో దొరికే మొక్కలనే ఔషధాలుగా ఉపయోగిస్తారు. అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలో ఒకటి అశ్వగంధ. దీనిని ఆయుర్వేదంలో దివ్య ఔషధిగా పేర్కొంటారు. దీనిలో ఒత్తిడిని తగ్గించి శరీరంలో రోగ నిరోధకతను పెంపొందించే గుణాలున్నాయని.. ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. దీంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కు చెక్ పెట్టడానికి ఈ అశ్వగంధతో మెడిసిన్ తయారు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

కోవిడ్ చికిత్సలో అశ్వగంధ సానుకూల ప్రభావం చూపించగలదనే అంశంపై అధ్యయనం చేసేందుకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ యూకెకి చెందిన లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ కలిసి పరిశోధనలు జరపనుంది. యూకెలోని మూడు నగరాల్లో దాదాపు 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.

మూడు నెలల పాటు క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ సమయంలో అశ్వగంధ ఔషదం తీసుకున్న వారి యొక్క యాక్టివిటీస్, మానసిక, శారీరక స్థితి, సప్లిమెంట్ ఉపయోగం, ప్రతికూలతలు వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ పరిశోధన మొత్తం పూర్తవడానికి దాదాపు 16 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ సక్సెస్ అయితే ఇన్ఫెక్షన్లను నిర్మూలించడంలో అశ్వగంధ సమర్థవంతంగా పనిచేయగలదని నిరూపించినట్లవుతుంది. సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి గుర్తింపు లభిస్తుంది.గతంలో ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అశ్వగంధ సహజ మూలికలు కరోనా కు చెక్ పెట్టె శక్తి ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరుపుతున్న అశ్వగంధ క్లినికల్ ట్రయల్స్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ అశ్వగంధకు గనుక కోవిడ్‌ను నిర్మూలించే శక్తి ఉంటే… ఇది ఎక్కడైనా విరివిగా దొరికే ఔషధం కనుక తక్కువ ఖర్చుతోనే. తక్కువ సమయంలోనే భారీగా కరోనా నివారణకు ఔషధాలను తయారు చేయవచ్చు.. దీంతో ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కోవిడ్ ఎదుర్కోవడం మరింత సులభమవుతుంది.

Also Read: ఒలింపిక్స్‌లో అద్భుతాన్ని సృష్టించిన అమ్మాయిలు.. పతకానికి ఒక్క అడుగు దూరంలో..