భూగర్భంలో పండించే బీట్‌రూట్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. మంచి ఆరోగ్యం కోసం బీట్‌రూట్ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.. దుంప జాతికి చెందిన బీట్‌రూట్‌లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో.. రోగాలు రోగాలను దూరం చేయడంలో సహాయపడతాయి.. అయితే.. బీట్‌రూట్‌ను అనేక విధాలుగా తీసుకోవచ్చు.. కూరగా, చట్నీగా.. సలాడ్ లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు.. ఇంకా పలు స్పెషల్ వంటకాలను కూడా తయారుచేసుకోవచ్చు.. అయితే.. బీట్‌రూట్‌ను చాలా మంది దీని రుచిని ఇష్టపడరు.. కానీ దాని పోషక విలువలు తెలిసిన వారు తమ రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకుంటారు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.. శరీరాన్ని దృఢంగా చేస్తుంది.
బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్‌లతో సహా అనేక పోషకాలు ఉన్నాయి. మీరు 10 గ్రాముల బీట్‌రూట్ తింటే.. మీకు 43 మిల్లీగ్రాముల కేలరీలు, 2 గ్రాముల కొవ్వు మాత్రమే లభిస్తుంది.. అంటే శరీర బరువు పెరగదు. ఇది మన శరీర అభివృద్ధికి చాలా ముఖ్యమైన పోషకమైన ప్రోటీన్లను కూడా పుష్కలంగా అందిస్తుంది.. బీట్ రూట్‌లలో బీటాలైన్లతోపాటు విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫోలేట్, డైటరీ ఫైబర్ ఉంటాయి.. ప్రతిరోజూ ఉదయం బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
బీట్ రూట్ జ్యూస్ ఉదయం తీసుకోవడం చాలామంచిది.. ఒకవేళ తీసుకోలేకపోతే.. రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..