Health Tips: పాలలో ఇవి కలుపుకొని తాగితే.. ఆ సమస్యలన్నీ మటుమాయం.. అవేంటో తెలుసుకోండి

|

Mar 06, 2022 | 8:44 AM

Health Care Tips: పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది పాలను ప్రతిరోజూ తాగుతారు. అయితే.. పాలు తాగేటప్పుడు చాలా మంది

Health Tips: పాలలో ఇవి కలుపుకొని తాగితే.. ఆ సమస్యలన్నీ మటుమాయం.. అవేంటో తెలుసుకోండి
Milk
Follow us on

Health Care Tips: పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది పాలను ప్రతిరోజూ తాగుతారు. అయితే.. పాలు తాగేటప్పుడు చాలా మంది బాదంపప్పును దానిలో కలుపుతారు. బాదం పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలలో క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు బాదంపప్పులో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. బాదం పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు (Milk) సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అందుకే పుట్టినప్పటి నుంచి.. పెద్దయ్యే వరకు పాలను తాపిస్తారు. పాలల్లో ఆరోగ్యానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున పాలలో ఏయే పదార్థాలను కలుపుకుని తాగితే ఎలాంటి ప్రయోజనాలు (Health Tips) కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు, బాదం కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

బాదం – పాలు రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. బాదం పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం ఉన్నాయి. ఇక బాదంలో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు దాగున్నాయి. కావున ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదం పాలు తాగడం వల్ల మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

పసుపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

పసుపు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు దాగున్నాయన్న విషయం అందరికీ తెలుసు. పాలలో పసుపు కలిపి తాగడం అనేది పూర్వం నాటి నుంచి వస్తుంది. పలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో పసుసు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపు పాలు పోషకాలతో పాటు చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మూత్రం, ఊపిరితిత్తులు, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో పసుపు పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

పాలలో తేనె కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

పాలలో తేనె కలుపుకొని తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పాలలాగే తేనె కూడా సద్గుణాల గనిగా పరిగణిస్తారు. విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, విటమిన్ ఎ, డి వంటి పోషకాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మీ శరీరానికి చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

Side Effects of Papaya: ఈ ఐదు రకాల సమస్యలున్నవారు బొప్పాయిని తినకపోవడం మంచిది

Pregnancy Care: కడుపుతో ఉన్నవారికి ఎలాంటి విటమిన్ అవసరం.. ఏ ఆహారం తీసుకుంటే మంచిది..