Health Tips For Women: శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మహిళలు ఈ ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకోండి..

|

Oct 29, 2021 | 10:10 AM

Health Tips For Women: ప్రకృతికి మనిషి శరీరానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకనే సీజన్ కు అనుగుణంగా లభ్యమయ్యే కూరగాయలు, పండ్లను ఆహారంగా..

Health Tips For Women: శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మహిళలు ఈ ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకోండి..
Health Tips For Women
Follow us on

Health Tips For Women: ప్రకృతికి మనిషి శరీరానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకనే సీజన్ కు అనుగుణంగా లభ్యమయ్యే కూరగాయలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా మారుతున్న సీజన్ బట్టి.. శరీరానికి అవసరమైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. చల్లని గాలితో రోజువారీ దినచర్యకు భంగం కలుగుతుంది. అందుకనే ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఒక మార్గం ఉంది.  తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఎందుకంటే వ‌య‌సు పైబడుతున్న మహిళలకు శరీరానికి పోషకాల అవసరం అధికంగా ఉంటుంది.  శీతాకాలంలో శరీరంలోని ఏర్పడే మార్పుల వలన మహిళలు చర్మం, జుట్టు, ఎముకలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు ఉన్న  మహిళలు వెన్ను, కాళ్ళలో నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

గంజి: గంజి మంచి అల్పాహారం. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం వరకూ ఆకలి వేయకుండా చేస్తుంది. గంజిలో అదనపు రుచి కోసం.. డ్రై ఫ్రూట్స్‌ జోడిస్తే.. మంచి రుచితో పాటు.. ఆరోగ్యాన్ని ఇస్తుంది.

విటమిన్ సి: శీతాకాలంలో విటమిన్ సి అత్యవసరం. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకని నారింజ, నిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన సిట్రస్ పండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలి. వీటిల్లో విటమిన్ సి ఉంటుంది.  విటమిన్ సీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.  చలికాలంలో వ‌చ్చే వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.

చిలగడదుంపలు : స్వీట్ పొటాటోలో ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం అధికంగా ఉంటాయి.  తక్కువ క్యాలరీలు మరియు అధిక పోషకాలు, అవి మీ పొట్టకు మేలు చేస్తాయి. చిలగడదుంపలు మలబద్ధకాన్ని నయం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

ఆకుపచ్చ కూరలు : ఆకుపచ్చని కూరగాయలలో మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  అంతేకాదు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకనే శీతాకాలంలో రెగ్యులర్ గా తినే ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరలను తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఆకులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శీతాకాలంలో సాధారణంగా ఎదుర్కొనే  చర్మం , జుట్టు సమస్యలను నివారిస్తుంది.

రాగులు: రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు రాగులతో చేసిన ఆహారం తప్పనిసరి.  మధుమేహం,  రక్తహీనత రోగులు రాగుల తినే ఆహారంలో తప్పనిసరిగా చేసుకోవాలి. ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి పరిస్థితులపై పోరాడడానికి సహాయపడుతుంది.

బాదం, అక్రోట్లు:  డ్రైపూర్ట్స్,  బాదం, వాల్‌నట్‌ వంటివి రెగ్యులర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు చురుకైన నాడీ వ్యవస్థను, ఆరోగ్యకరమైన గుండెను ఇస్తుంది. అందుల్లనే  శీతాకాలంలో రోజు సాయంత్రం తినమని సూచిస్తున్నారు.

Also Read:  ఉపాధిలేని యువత డ్రగ్స్ దందాలో చిక్కుకుంటున్నారు.. గంజాయి వ్యాపారానికి అడ్డు కట్టవేయాలంటున్న పవన్ కళ్యాణ్..