ICMR Survey: ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) లెక్కల ప్రకారం మన దేశంలో 40-45 కోట్ల మంది కరోనా బాధితులున్నారు. ఇటీవల కొవిడ్ వ్యాప్తిపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) దేశ వ్యాప్తంగా సీరో-సర్వే చేపట్టింది. ఈ అధ్యయన ఫలితాల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఐసీఎంఆర్ చేపట్టిన సీరో సర్వేల్లో ఇది మూడోది. దేశ వ్యాప్తంగా సార్స్ కోవ్-2 వైరస్ ఇన్ఫెక్షన్ బారిన వారి శాతం 24.1 అని తాజా సర్వేలో తేలింది.
సీరో సర్వే అంటే..
ఎంపిక చేసిన వ్యక్తుల రక్తంలో ఉండే సీరంను పరీక్షించి నావెల్ కరోనా వైరస్ సార్స్-కోవ్-2 జాడలను గుర్తించే ప్రక్రియ.
సీరం ఎలా తీస్తారు.
రక్తం గడ్డ కట్టించిన తర్వాతే సీరంను రక్తం నుంచి తీసే అవకాశముంటుంది. బ్లడ్ ఏ టైప్ కు చెందినదన్న విషయాన్ని నిర్ధారించడానికి.. ఇతర ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి జరిపే పరీక్షే ‘సీరం టెస్ట్’.
మూడో సర్వే కాలంలో ఇన్ఫెక్షన్ నిర్ధారణకోసం 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లోని ఏడు వందల గ్రామాలు, వార్డుల్లోని సాధారణ ప్రజలతో పాటు ఆరోగ్య కార్యకర్తలను ఐసీఎంఆర్ ఎంచుకుంది. ప్రతీ జిల్లా నుంచి 10 ఏళ్లు పైబడ్డ సాధారణ ప్రజలు కనీసంగా 400 మందిని, 100 మంది ఆరోగ్య కార్యకర్తల సీరంను తీసుకుని ఐసీఎంఆర్ పరీక్షించింది. మొత్తంగా సాధారణ పౌరులు..28,589 ఉండగా, ఆరోగ్య కార్యకర్తలు 7,171మంది సీరంను ఐసీఎంఆర్ పరీక్షించింది.
అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి..
1. పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే
2. ఈ లెక్కన 32 కోట్ల వరకు జనాభా కరోనా బాధితులే అని వెల్లడి.
3. జనవరి2021 నాటికి ఇన్ఫెక్షన్ గణాంకాలివి.. ఈ గణాంకాల ప్రకారం 2021 మే నెల నాటికి 40-45 కోట్లమందికి కరోనా భాధితులు ఉంటారని అంచనా.
4. అంటే దేశంలో 24.1 శాతం కరోనా బాధితులుగా లెక్క తేల్చిన అధ్యయనం.
5. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే… అప్పటికే మరో 27 కేసులు ఉన్నట్లే నని వెల్లడి.
6. పట్టణ ప్రాంతాల్లో వైరస్ సంక్రమణ 26.2 శాతం
7. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ సంక్రమణ 19.1 శాతం.
8. దేశంలో అత్యధిక జనాభాలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఉండే అవకాశముందని వ్యాఖ్యినించిన ఐసీఎంఆర్ సీనియర్ సలహాదారుడు డాక్టర్ సునీల గార్గ్.
9. గ్రామాల్లో తక్కువ ఆరోగ్య సదుపాయాలు, ఆక్సిజన్ బెడ్ల సౌకర్యం, ఇతర ఔషధాలు అందుబాటు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ సోకిన వారు భారీ సంఖ్యలో ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్న ఐసీఎంఆర్.
10. వైద్యులు, నర్శులలో సంక్రమణ శాతం 26.6 శాతం
11. ఫీల్డ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఇన్ఫెక్షన్ రేటు 24.9శాతం.
అతి పురాతన పరిశోధనా సంస్థ..
ఐసీఎంఆర్ ప్రపంచంలోనే ఇది అతి పురాతనమైన పరిశోధనల సంస్థల్లో ఒకటి. 1949లో ఐసీఎంఆర్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దీన్ని ఐఆర్ ఎఫ్ ఏ( ఇండియన్ రీసెర్చ్ ఆఫ్ ఫండ్ అసోసియేషన్) పేరుతో పిలిచేవారు. ఇది 1911లో ప్లేగు వ్యాధి విస్తరించిన సమయంలో శాస్త్రీయ సలహా మండలిగా ఏర్పాటు చేశారు.
Also read: IMF about Corona: కరోనా చాలా ఖరీదైనది.. దీని అంతానికి 364 లక్షల కోట్లు అవసరం అంటున్న ఐఎంఎఫ్