Carrot juice:రెగ్యులర్ గా తినే ఆహారాల్లో క్యారెట్ ఒకటి.. ఈ దుంపని తరచుగా తీసుకుంటే.. కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే.. ఈ క్యారెట్ లో చాలా విటమిన్స్ తో పాటు మినరల్స్ కూడా ఉన్నాయి. అయితే రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యుస్ ను తాగడం వలన కలిగే లాభాలు తెలుసుకుందాం..
*క్యారెట్ జ్యుస్ మహిళలు ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. .
*క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
* ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.
*గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
*డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు క్యారెట్ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
*రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న అనారోగ్యాలను తట్టుకునే శక్తి వస్తుంది.
*ఐరన్ పుష్కలంగా ఉండడంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తం బాగా వృద్ధి చెందుతుంది.
*ఎముకలు దృఢంగా మారుతాయి. నరాల బలహీనత పోతుంది.
*జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
*మలబద్దకం తగ్గుతుంది. అసిడిటీ దరిచేరదు
Also Read: మాంసాహార మొక్కలుంటాయనే విషయం మీకు తెలుసా..! క్రిమికీటకాలే కాదు బల్లులు ఈ మొక్కకు ఆహారమే