Immunity Booster Foods: కరోనా యుగంలో రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడం ఒక అవసరంగా మారింది. ఈ సమయంలో ప్రజలు ఈ ప్రమాదకరమైన వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వారి జీవనశైలిలో అనేక మార్పులు చేసుకున్నారు. కాలానుగుణంగా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి అలవర్చుకున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకంగా సహాయపడతాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల మనం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇందులో జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ జ్వరాలు లాంటివి మొదలైనవి ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి ఆహారాలను (Healthy Foods) చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు: రోగనిరోధక శక్తిని పెంచడానికి, నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, టాన్జేరిన్ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మిరపకాయ: రెడ్ క్యాప్సికమ్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. ఇది మన కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ సి మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
బ్రోకొలీ: బ్రకోలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ, ఫైబర్, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
వెల్లుల్లి: వెల్లుల్లి వంటకాల రుచిని మెరుగుపరచడమే కాకుండా ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఆహారానికి రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇన్ఫెక్షన్‌తో పోరాడే గుణాలు ఇందులో ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
అల్లం: అల్లం వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గొంతు నొప్పి, జీర్ణ వ్యవస్థ వ్యాధుల నుంచి ఉపశమనం పొందేలా సహాయపడుతుంది. వికారం, వాంతులు లాంటివి నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉన్నాయి.
పసుపు: పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఇది కీలకంగా పనిచేస్తుంది.
Also Read: