White Hair: షాంపూలో వీటిని మిక్స్‌ చేసి వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది..!

|

Mar 11, 2022 | 2:02 PM

White Hair: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కలుషిత నీటి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

White Hair: షాంపూలో వీటిని మిక్స్‌ చేసి వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది..!
White Hair
Follow us on

White Hair: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కలుషిత నీటి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో మీ తెల్లజుట్టని నల్లగా మార్చుకోవడానికి ఆయుర్వేద పద్దతిని ట్రై చేయండి. మనం ప్రతిరోజు వాడే షాంపూలో కొన్ని హెర్బల్‌ ప్రొడక్ట్స్‌ మిక్స్‌ చేసి వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. సహజ పద్దతిలో జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. షాంపూలో రెండు టీ స్పూన్ల టీ పొడి, మెంతి గింజలు, ఉసిరి పొడి కలిపితే సరిపోతుంది. అయితే ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో సగం లీటరు నీటిని తీసుకొని గ్యాస్‌పై వేడి చేయండి. ఇప్పుడు ఈ నీటిలో అన్ని హెర్బల్‌ పొడిలను వేయండి. ఈ నీరు సగం వరకు తగ్గేవరకు తక్కువ మంటపై వేడి చేయండి.

తర్వాత గ్యాస్‌ను ఆపివేసి ఈ నీటిని చల్లబరిచి ఒక ప్లాస్టిక్ సీసాలో భద్రపరచండి. ఇది పాడవకుండా ఫ్రిజ్‌లో పెడితే బెటర్‌. తర్వాత స్నానం చేసేటప్పుడు షాంపూని నేరుగా జుట్టుకు పట్టించకుండా ఒక గిన్నెలో వేసుకోండి. అందులో అందులో అరకప్పు హెర్బ్స్ వాటర్ వేసి మంచిగా కలపండి. దీనిని జుట్టుకి పట్టించండి. వారానికి 2-3 సార్లు ఇలాంటి షాంపూతో తలస్నానం చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

IND vs SL: ఈ గ్రౌండ్‌లోనైనా సెంచరీ చేస్తాడా.. అభిమానుల కోరిక నెరవేరుస్తాడా..

Eating Fast: వేగంగా తినడం వల్ల చాలా నష్టాలు.. తెలిస్తే ఎప్పుడు అలా ట్రై చేయరు..!

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఆ నెంబర్ల గురించి సమాచారం తెలుసుకోండి..!