Garlic Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు మిస్ చేయరు

|

Jul 24, 2023 | 9:26 PM

మన దైనందిన జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు. వాటిని తగ్గించుకునేందుకు వేలకు వేలు వెచ్చించి మరీ.. రోజుకు పదుల సంఖ్యలో ట్యాబ్లెట్లు మింగుతుంటాం. కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం మన వంటింట్లోనే ఉంటుంది. వంటిల్లే వైద్యశాల అని ఊరికే..

Garlic Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు మిస్ చేయరు
Garlic Benefits
Follow us on

మన దైనందిన జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు. వాటిని తగ్గించుకునేందుకు వేలకు వేలు వెచ్చించి మరీ.. రోజుకు పదుల సంఖ్యలో ట్యాబ్లెట్లు మింగుతుంటాం. కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం మన వంటింట్లోనే ఉంటుంది. వంటిల్లే వైద్యశాల అని ఊరికే అనలేదు పెద్దలు. వంటింట్లో ఉండే పదార్థాల్లో వెల్లుల్లితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

-ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండు తిని, మంచినీరు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయి. అలాగే శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.

-చెడుకొలెస్ట్రాల్ (LDL-C)ను తగ్గించడంతో పాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

-హ్యూమన్ 3, హైడ్రాక్సీ-3, మిథైల్ గ్లుటరిల్ కో ఎంజైమ్ -ఎ (HMG-CoA), స్క్వాలీన్ మోనో ఆక్సిజనేస్ వంటివి కొలెస్ట్రాల్ ను నివారించడంలో సహాయపడుతాయి.

-ప్రతిరోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండెకు మంచిది. గుండెకు రక్తప్రసరణ సమృద్ధిగా జరుగుతుంది.

-శరీరంలో రక్తం గడ్డకుండా వెల్లుల్లిలో యాంటీ క్లాటింగ్ గుణాలు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్ కూడా తొలగుతాయి.

-పరగడుపునే వెల్లుల్లిని తింటే.. లివర్, మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు కాలేయాన్ని కూడా క్లీన్ చేస్తుంది.

-ముఖ్యంగా డయేరియా ఉన్నవారికి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే త్వరగా దాని నుంచి ఉపశమనం పొందవచ్చు.

-పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. నాడీ వ్యవస్థను సైతం మెరుగు పరుస్తుంది.

-ఆకలి లేని వారికి ఆకలిని ప్రేరేపించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

-వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..