వర్షాకాలం, శీతాకాలంలో చాలామంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకు కారణం ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలు. కొందరికి ఆస్తమా, నిమ్ము సమస్యలు కూడా ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, సిగరెట్లు, ఆల్కహాల్ తాగటం వంటి అలవాట్ల కారణంగా.. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలను తొలగించేందుకు ఈ డ్రింక్ తాగితే చాలు. మార్కెట్లో దొరికేది కాదు. మన ఇంట్లో.. మనం రోజూ వంటల్లో వాడే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు.
ఈ డ్రింక్ కోసం మనకు కావలసిన పదార్థాలు:
అల్లం, ఉల్లిపాయ, తేనె, నిమ్మరసం, పసుపు, ఒక గ్లాసు మంచినీరు.
తయారీ విధానం:
*ఒక గిన్నెలో ఒక గ్లాసు త్రాగునీరు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మరగనివ్వాలి.
*ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసి.. మరో 2 నిమిషాలు మరిగించి.. అర టీ స్పూన్ పసుపు వేయాలి. ఇంకొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. గోరువెచ్చగా అయ్యేవరకూ చల్లారనివ్వాలి.
*ఇప్పుడొక గ్లాస్ లోకి నీటిని వడగట్టుకుని .. అర చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకుని.. గోరువెచ్చగా రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఈ పానీయాన్ని తాగడం మొదలుపెట్టిన 72 గంటల్లోనే మీ శరీరంలో మార్పు తెలుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి.
*ఇలా రెండు నెలలపాటు తాగితే.. ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలు క్రమంగా తొలగిపోయి పూర్తిగా శుభ్రమవుతాయి. దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో పాటు, కాలేయం, శరీరంలో పేరుకున్న మలినాలు కూడా యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి