వాకింగ్ వల్ల హై బీపీ తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

ప్రస్తుత రోజుల్లో హై బీపీ చాలా సాధారణ ఆరోగ్య సమస్య అయింది. దీన్ని సరిగ్గా నియంత్రించకపోతే అది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీలు పాడవడం లాంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో వాకింగ్ వల్ల నిజంగా రక్తపోటు తగ్గుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

వాకింగ్ వల్ల హై బీపీ తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
High Blood Pressure

Updated on: Jun 18, 2025 | 9:37 PM

నడక అనేది చాలా సులభమైన వ్యాయామం. దీనికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఎక్కడైనా నడవొచ్చు. చిన్న స్థలంలో కూడా నడక చేయవచ్చు. ఇది శరీరానికి చాలా మంచి కార్డియో వ్యాయామం. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపేటప్పుడు రక్తనాళాల్లో ఏర్పడే ఒత్తిడిని రక్తపోటు అంటారు. కానీ ఇది ఎప్పుడూ ఎక్కువగా ఉంటే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి అవి గట్టిపడుతాయి. దీని వల్ల గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

రోజూ నడిస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీని వల్ల గుండె బలంగా మారుతుంది. బలమైన గుండె శరీరానికి అవసరమైన రక్తాన్ని సమర్థంగా పంపగలదు. ఫలితంగా రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా నడక వల్ల రక్తనాళాలు సులభంగా నర్మంగా కదులుతూ ఉండడంతో రక్తప్రసరణ మరింత మెరుగవుతుంది.

శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే రోజూ వాకింగ్ చేస్తే క్యాలరీలు ఖర్చవ్వడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. ఇది పరోక్షంగా హై బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది.

వాకింగ్ వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా బీపీని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి వాకింగ్ వల్ల ఇన్సులిన్ ప్రభావం మెరుగవుతుంది. దీని వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గి రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది.

మొదటి రోజూ 10 నుండి 15 నిమిషాలు నడవడం మొదలుపెట్టాలి. తర్వాత నెమ్మదిగా ఆ సమయాన్ని 30 నిమిషాలకు పెంచుకోవచ్చు. నడిచేటప్పుడు శరీరం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తల వంచకుండా, నేరుగా చూస్తూ, చేతులను స్వేచ్ఛగా ఊపుతూ నడవడం మంచిది.

వాకింగ్ చాలా సాధారణంగా కనిపించినా దాని ప్రయోజనాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారికి ఇది చాలా సురక్షితమైన, సహజమైన మార్గం. రోజూ కొంతసేపు నడవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా దారితీస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)