ప్రజంట్ అంతా కల్తీమయం అయిపోయింది. తినే ఫుడ్.. తాగే వాటర్ అంతా కల్తీ మయం. దీంతో ప్రజలు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మన జీవనశైలి, పరిసరాలు, మారుతున్న కాలం కూడా రోగాల బారిన పడేలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇక శరీరంలో అధిక వేడిమి వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు వెంటాడతాయని.. తద్వారా మీరు పలు రోగాల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వేసవి(Summer) కాలంలో సాధారణంగానే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు గురై.. డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో శరీరంలో అధిక వేడి ఉత్పన్నం కావడం వల్ల తలనొప్పి(Headache), మలబద్దకం ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఒక్కోసారి ఈ డీహైడ్రేషన్ ప్రాణలకు ముప్పు తీసుకురావొచ్చు. మరి ఇలాంటి పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉండేలా చూసుకోవాలి. మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుందని న్యూరాలజిస్ట్‌లు చెబుతున్నారు. దీంతోపాటు మనం తీసుకునే ఫుడ్, ఇతర అలవాట్లతో కూడా శరీరంలో అధిక వేడిని తగ్గించుకోవచ్చు. అందుకే వేడిని తగ్గించేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల సమస్యను అధిగమించవచ్చని వైద్య నిపుణుల సలహా.
గమనిక:– ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.
Also Read: Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం