Fast Food: ఫాస్ట్ ఫుడ్ తెగ లాగించేస్తున్నారా..? తిన్న తర్వాత ఇవి తీసుకుంటే ఆ సమస్యలు దరిచేరవు..

|

Sep 25, 2022 | 6:50 AM

Oily And Fast Food: ప్రస్తుత కాలంలో చాలామంది ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడుతున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.

Fast Food: ఫాస్ట్ ఫుడ్ తెగ లాగించేస్తున్నారా..? తిన్న తర్వాత ఇవి తీసుకుంటే ఆ సమస్యలు దరిచేరవు..
Fast Food
Follow us on

Oily And Fast Food: ప్రస్తుత కాలంలో చాలామంది ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడుతున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఫ్రై లేదా స్పైసీగా ఉండే ఆహారాన్ని చూసిన తర్వాత ఎవ్వరూ కూడా తినకుండా ఉండలేదు. మనస్సులో తినాలన్న ఇంప్రెషన్ కూడా పెరుగుతుంది. అయితే.. తినే ముందు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. ఆయిలీ, ఫాస్ట్ ఫుడ్ తినేముందు వెయ్యిసార్లు ఆలోచించాలి.. దీనివల్ల ఎలాంటి జబ్బు వస్తుందో తెలియదు. మీరు కూడా ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడితే మీ మనస్సును చంపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్ స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినడం ద్వారా దీనివల్ల కలిగే నష్టాలను నివారించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. గోరువెచ్చని నీరు: ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత గోరువెచ్చని వేడి నీటిని తాగడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వేడి నీరు భారీ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా అదనపు నూనె శరీరంలో ఉండకుండా చేస్తుంది.
  2. గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో తగినంత యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. మీరు ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ వేయించిన ఆహారాన్ని తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే అప్పుడు ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు. ఇది ఆయిల్ ఫుడ్ నష్టాన్ని నివారిస్తుంది.
  3. సోంపు, వాము నీరు: సోంపు, వాము నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పని చేస్తాయి. హెవీ ఫుడ్ తిన్న తర్వాత సోంపు, వాము నీరు తాగటం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా ఇవి మనల్ని ఫిట్‌గా ఉంచుతాయి. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంటే ఫాస్ట్ ఫుడ్ వల్ల వచ్చే ఊబకాయాన్ని కూడా నివారించుకోవచ్చు.
  4. పెరుగు: పెరుగు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరుగు తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది నూనె ప్రభావాన్ని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది. ఆయిల్ ఫుడ్ తర్వాత పెరుగులో జీలకర్ర కలిపి తింటే ఇంకా మంచిది.
  5. తృణధాన్యాలు: తృణధాన్యాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నూనె ఆహారం తర్వాత తృణధాన్యాలను తినవచ్చు. తృణధాన్యాలు తినడం వల్ల, నూనెతో కూడిన ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. వాటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచకుండా నిరోధిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..