
కాలేయం శరీరాన్ని శుభ్రం చేయడం నుండి జీర్ణక్రియ వరకు ఎన్నో పనులు చేస్తుంది. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం.. కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ వ్యాధి అంటారు. ఈ కొవ్వు ప్రారంభంలో ఎలాంటి ఇబ్బంది కలిగించదు. కానీ చాలా కాలం తర్వాత.. ఇది కాలేయంలో వాపుకు కారణమై కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది సిర్రోసిస్ అనే తీవ్రమైన వ్యాధిగా మారవచ్చు.
చాలా మంది ఫ్యాటీ లివర్ అంటే మద్యం వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మద్యం తాగకపోయినా.. తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. ఈ సమస్యలు ఈ రోజుల్లో చాలా సాధారణం అయ్యాయి.
ఈ కారణాల వల్ల కాలేయంలో వ్యర్థాలు పేరుకుపోయి.. దాని పనితీరు నెమ్మదిగా తగ్గుతుంది.
ఈ విధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఫ్యాటీ లివర్ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. ప్రారంభ దశలోనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)